guntur general hospital doctors submit report to government on infant death

Rats are not only the reason to death of kid says venugopal

rats killed baby boy in Guntur, rats bitten baby boy in GGH, GGH doctors try to escape from infant death, ggh doctors submit report to government, ggh doctors says rats are not only the reason to infant death, baby boy bitten twice by rats in ggh, baby boy death, doctors report, government, doctor venugopal rao, rat bite

guntur general hospital doctors submit report to government on infant death says that apart from rats, his critical condition is also reason to death

శిశువు మృతికి ఎలుకలే కాదు.. అదీ కారణమేనంటున్న వైద్యులు

Posted: 08/27/2015 10:24 PM IST
Rats are not only the reason to death of kid says venugopal

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం, అందులోనూ సిబ్బంది నిర్లక్ష్యం ప్రత్యక్షంగా ప్రస్పుటిస్తున్న తరుణంలో అటు ప్రభుత్వం పరువుతో పాటు ఇటు తమ సిబ్బందిని కాపాడుకునే పనిలో గుంటూరు వైద్యాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ క్యూబేటర్ పై నున్న 10 రోజుల శిశువును ఎలుకలు రెండు పర్యాయాలు కొరికినా అక్కడి సిబ్బంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరికదా విషయం మీడియాకు తెలిసిన తరువాత కూడా తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారే తప్ప.. వారిలో అసలు పశ్చాతాప ధోరణే కనబడలేదు.

మీడియా ఆసుపత్రికి వెళ్లి శిశువును చిత్రీకరించే క్రమంలోనూ అక్కడ ఎలుకలు తన సామ్రాజ్యంలోకి ఎందుకు అడుగుపెడుతున్నారన్నట్లు ప్రతినిధులను కూడా బెంబేలెత్తించాయి. ఇన్ని ఎలుకలు ఆసుపత్రిలో వున్నా.. అక్కడి సిబ్బంది తమకు పట్టనట్లు వ్యవహరించారు. పుట్టిన శిశువులకు చెందిన విభాగంలో వారికి ఎలాంటి వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వైద్యులు.. ఎలుకలు సంచరిస్తున్నా చూసిచూడనట్లుగా వ్యవహరించడం వారి నిర్లక్ష్య ధోరణికి కారణం. పుట్టిన శిశువులు అనారోగ్యంతో బాధపడుతూ.. వుండే వార్డులో ఎలుకలు వారిని కరిచినా.. కళ్లు కూడా తెరవని పసికందులు వారి భాధను ఎవరితో చెప్పుకుంటారు. ఇదే అదనుగా భావించిన అక్కడి సిబ్బంది.. జీతం వస్తుందన్న చందంగా విధులు నిర్వహించడంఈ ఘటనకు కారణం.

ఎలుకలు కొరికి మృతి చెందిన శిశువు కేసు నుంచి బయటపడేందుకు ఇటు వైద్యసిబ్బంది, అటు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డా.వేణుగోపాల్‌రావు ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ఈనెల 17వ తేదీన విజయవాడ నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. కన్‌జెనిటల్ అనామిలీస్ (పుట్టుకతో వచ్చే అసాధారణ లోపం)తో చేరిన ఈ శిశువును 18వ తేదీన సర్జరీ వార్డుకు తరలించామని, 20వ తేదీన శస్త్ర చికిత్సకు సిద్ధం చేశామని, వెంటిలేటర్‌పై ఉన్న ఆ శిశువు పరిస్థితి అప్పటికే ప్రమాదకరంగా ఉందని పేర్కొన్నారు.

ఈనెల 23న శిశువు ఎడమ చేతికి ఎలుకల గాటు పడి ఉందని, ఈ విషయాన్ని ఇన్‌చార్జీ, ప్రొఫెసర్ డా.భాస్కర్‌రావుకు సమాచారమిచ్చామని కూడా నివేదికలో పొందుపరిచారు. అనంతరం వార్డును శుభ్రపరిచామని, అయినా దురదృష్టవశాత్తు ఈనెల 26వ తేదీ తెల్లవారుజామున 4-5గంటల మధ్యలో ఎలుకలు తిరిగి శిశువు ఛాతిపై దాడిచేశాయని పేర్కొన్నారు. ఓవైపు ఎలుకలు కొరికిన గాయాలు ఉన్నాయని చెబుతూనే మరోవైపు కన్‌జెనిటల్ అనామిలీస్‌తో వచ్చిన ఈ బిడ్డ మృతికి ఎలుకల గాట్లే కాకపోయి ఉండచ్చునని తెలిపారు. దీంతో మంత్రులు కామినేని శ్రీనివాస్, పి. నారాయణ తదితరులు ఆస్పత్రిని సందర్శించి.. వైద్యులను తర్వాత ఎలుకల కథ కంచికి చేరేలా నివేదిక మార్చినట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన శిశువు మరణం కేసును మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించిన తరుణంలో నివేదికను బలహీనపరిచేలా చేసేటట్టు నాయకులే ఒత్తిడి తెచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే తెలివిగా ఆర్‌ఎంఓ తదితర కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వార్డులో మరో 20 మంది చిన్నారులు ఉన్నా ఎవరికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని, ఈ శిశువు కూడా ఎలుక కారణంగా మృతి చెంది ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు శిశువు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందే మృతికి కారణమని గొడవ చేశారని వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles