ISRO successfully launches GSLV-D6 carrying GSAT-6 satellite

Isro launches gsat 6 communications satellite

GSLV-D6, ISRO, Cryogenic Upper Stage, GSAT-6, Geosynchronous Transfer Orbit , ISRO successfully launches GSLV-D6 carrying GSAT-6 satellite,news, India news,Current Affairs News,Current Affairs News in India

Geo-synchronous Satellite Launch Vehicle (GSLV) D6 carrying GSAT-6 was launched from Sriharikota, on Thursday at 4:52 p.m.

కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-6 ప్రయోగం సక్సెస్.. ప్రధాని అభినందనలు

Posted: 08/27/2015 08:21 PM IST
Isro launches gsat 6 communications satellite

భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖిస్తూ జీఎస్ఎల్వీ డి-6 ప్రయోగం విజయవంతం అయ్యింది. సంపూర్ణ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్ దశతో వరుసగా రెండోసారి విజయాన్ని అందుకుంది. ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్‌ఎల్వీ డీ6 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. గురువారం సాయంత్రం 4.52 గంటలకు జీఎస్‌ఎల్వీ డీ6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జీశాట్-6 ఉపగ్రహాన్ని 1,024 సెకన్ల తర్వాత నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. మిషన్ డైరెక్టర్  ఉమామహేశ్వరన్ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో ద్వారా డిజిటల్ మల్టీమీడియాలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో తెలిపింది. జీశాట్-6 ఉపగ్రహం 9 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. దేశ కమ్యూనికేషన్ వ్యవస్థలో 25వ శాటిలైట్ గా జీశాట్-6 నిలవనుంది. ఈ ప్రయోగానికి రూ.250 కోట్లు వ్యయం అయింది.

కాగా, ఇప్పటివరకు 'నాటీబోయ్'గా అంతరిక్ష శాస్త్రవేత్తలు ముద్దుగా పిలుచుకునే జీఎస్ఎల్వీ.. చాలా రోజుల తర్వాత నేరుగా విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అంతులేదు. ఇదే విషయాన్ని మిషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరన్ కూడా ప్రయోగం విజయవంతం అయిన తర్వాత శాస్త్రవేత్తలను అభినందిస్తూ చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. తమ నాటీబోయ్ ఇప్పుడు బాగా క్రమశిక్షణ గల అబ్బాయిలా మారిపోయాడని, తమను అస్సలు ఇబ్బంది పెట్టకుండా మంచి విజయం సాధించాడని ఆయన అన్నారు. ఈ 'నాటీబోయ్' విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. భారత శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gsat 6  gslv d6  isro  siharikota  SHAR  

Other Articles