will bifurcate high court and justify telangana and andhra pradesh

Centre will do justice to both telugu states says venkaiah naidu

centre will do justice to both telugu states, venkaiah naidu, union minister venkaiah naidu, jitender reddy, vinod, TRS mps, parliament, High court, bifurcation of high court

will bifurcate high court and justify telangana and andhra pradesh says union minister venkaiah naidu

రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం

Posted: 08/04/2015 11:33 PM IST
Centre will do justice to both telugu states says venkaiah naidu

తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లకు న్యాయం చేస్తామని కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రెండు రాష్ర్టాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై చట్టంలో స్పష్టంగా ఉందని, రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హైకోర్టు ఉండాల్సిందేనని అన్నారు. విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేస్తుందని ఆయన లోక్‌సభలో ప్రకటించారు. ప్రత్యేక హైకోర్టు అంశంపై తెలంగాణ ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన లోక్‌సభలో సమాధానం ఇస్తూ ఈ విషయమై ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి ఒకసారి న్యాయశాఖ అధికారులతో సమావేశమయ్యారన్నారు. రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఏర్పాటు చేసిన పక్షంలో అనేక మందికి న్యాయమూర్తులు ఉద్యోగాలు లభిస్తాయని ఆయన పేర్కోన్నారు.

అంతకుముందు లోక్ సభ సమావేశాలలలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ జీతేందర్ రెడ్డి హైకోర్టు విభజనపై ప్రశ్నించారు. హైకోర్టును విభజించాలని విభజన చట్టంలో వున్నా.. ఈ విషయమై కేంద్రం జాప్యం చేయడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును  ఏపీలోనే ఏర్పాటు చేసుకోవాలని విభజన చట్టంలో స్పష్టంగా వుందన్నారు. ప్రస్తుతం వున్న ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో 29 మందిలో 25 మంది న్యాయమూర్తులు ఆంధ్రప్రాంతానికి చెందినవారేనన్నారు. జితేందర్ రెడ్డి తరువాత ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయి 14 మాసాలు అవుతున్న ఇంకా ఉమ్మడిగా హైకోర్టును ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు న్యాయం చేస్తామని ప్రకటించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  jitender reddy  vinod  High court  

Other Articles