Bengaluru 3-Year-Old Assaulted at School, Guard Arrested

Bangalore 3 year old girl sexually assaulted at school

Bangalore: 3-year-old girl sexually assaulted at school, bangalore crime sexual assault Bangalore sexual assault, rape, sexual assault, bangalore sexual assault, child sexual assault, indiranagar sexual assault, gang rape, violence against women, crime against women, harrassment against women

A three-year-old girl was allegedly sexually assaulted at her school in Indiranagar in bengaluru, police said.

బెంగుళూరులో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం..

Posted: 08/04/2015 11:31 PM IST
Bangalore 3 year old girl sexually assaulted at school

బెంగుళూరు మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని అమాయక చిన్నారిని కామాంధుడు కాటు వేశాడు. తూర్పు బెంగుళూరులోని ఇందిరానగర్ లో వున్న ఓ పాఠశాలలో ఈ దారుణ ఘటన జరిగింది. ఘటనకు బాధ్యుడైన పాఠశాల సెక్యూరిటీ గార్డును కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నర్సరీ చదువుతున్న ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై మగమృగం విరుచుకుపడటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బెంగుళూరులోని ఓ ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగాలు చేసుకుని జీవనం సాగిస్తున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన దంపతులు.. వారి గారాల పట్టిని నర్సరీ విద్య నేర్చుకునేందుకు ఈ ఏడాది పాఠశాలలో చేర్పించారు. బాధిత బాలిక సోదరి ఇచ్చిన సమాచారం మేరకు సదరు పాఠశాల సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే స్కూల్లో మూడేళ్ల బాలికపై అత్యాచారం జరగిన వార్త దవాణంలో వ్యాపించి పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరకున్న స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో ఒకానోక దశలో పోలీసులకు, ఆందోళనకారుకు మధ్య తీవ్ర తోపులాట కూడా చోటుచేసుకుంది. ఈ కేసులో స్కూల్‌ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్థారించారు. అయినప్పటికీ ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయకపోవడంపై అంధోళన కారుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని ప్రశ్నిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangalore crime sexual assault Bangalore sexual assault  

Other Articles