Parties should be united against terrorism, Rajnath Singh

Arun jaitley says death penalty will stay

Arun Jaitley says death penalty will stay, Arun Jaitley, Yakub Memon, Bombay blasts, Congress, Indira Gandhi killers, Indira Gandhi, death penalty, opposition Congress,

Jaitley also came down hard on the opposition Congress for questioning Memon's death sentence, asking, "Where was the Congress when Indira Gandhi killers were given death penalty?"

రాజకీయం తగదన్న రాజ్‌నాథ్.. ఉరి కొనసాగుతుందన్న జైట్లీ..

Posted: 07/31/2015 09:19 PM IST
Arun jaitley says death penalty will stay

ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్ ఉరిశిక్ష విధించిన తరువాత.. ఈ అంశమై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. భారత్ లో ఉరిశిక్షలు కోనసాగుతుందని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు ఉరిశిక్ష అమలు తప్పదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. యాకుబ్‌ను ఉరి తీయడం బాధ కలిగించిందంటోన్న కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ హత్య దోషులను ఉరితీసేటప్పుడు ఎక్కడికి పోయారని ఆయన ప్రశ్నించారు. ముంబై పేలుళ్ల కేసులో, మారణహోమం కేసులో మిగతా దోషులు ఎవరు దొరికినా.. వారందరికీ ఉరిశిక్ష తప్పదని జైట్లీ చెప్పారు.

మరోవైపు ఉగ్రవాదాన్ని రాజకీయం చేయవద్దని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాలకు సూచించారు. ఉగ్రవాదానికి మతం, కులం, ప్రాంతం ఉండవని లోక్‌సభలో చెప్పారు. హిందూ ఉగ్రవాదం అనే పదం వాడవద్దని, దీనివల్లే ఉగ్రవాదంపై భారత్ వైఖరి చులకనైందని రాజ్‌నాథ్ ఆవేశంగా అన్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని రాజకీయం చేయడం లేదని స్పష్టం చేశారు. హిందూ ఉగ్రవాదమనే అంశాన్ని లేవనెత్తడం ద్వారా యూపిఏ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  Yakub Memon  Bombay blasts  Congress  

Other Articles