Constable Found Hanging at Home in Madhya Pradesh, Opposition Alleges It's Another Vyapam Death

Constable questioned in mp vyapam scam case found hanging at home

Constable questioned in MP Vyapam scam case found hanging at home, Vyapam scam, MPPEB scam, STF, MP constable found dead, Ramakant Panda, Dr Arun Sharma,Vyapam scam,MPPEB scam,MPPEB,Dean Arun Sharma,Jabalpur medical college,NS medical college, Delhi journalist death, Aaj Tak journalist, Vyapam scam, Rahul Gandhi, Arvind Kejriwal, cremation, Kailash Vijayvargiya, Journalist, Akshay Singh, joke, media, Madhya Pradesh, Shivraj Singh Chouhan, Madhya Pradesh Chief Minister, Anamika Kushwaha, Journalist death

A constable, who was questioned by authorities in connection with the Vyapam scam, was found dead in mysterious circumstances at his official residence in Tikamgarh district of Madhya Pradesh

కాటేస్తున్న కిల్లింగ్ స్కామ్.. విచారణకు హాజరైన కానిస్టేబుల్ అనుమానస్పద మృతి

Posted: 07/07/2015 04:55 PM IST
Constable questioned in mp vyapam scam case found hanging at home

మధ్యప్రదేశ్‌లో కిల్లర్ స్కామ్ లో మరణ మృదంగం కోనసాగుతోంది. ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న వారి ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. ఈ కేసులో నిందితులు నుంచి సాక్షులు, విచారణ చేస్తున్న పాత్రికేయులు, చివరకు సాక్షులు కూడా అసహజంగా అసువులు బాస్తున్నారు. ఈ కుంభకోణంలో తాజాగా ఇటీవలే విచారణకు హాజరై వచ్చిన కానస్టేబుల్ రమాకాంత పాండా మరణించాడు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, రమాకాంత పాండేది కూడా వ్యాపం హత్యేనని విపక్షాలు అరోపిస్తున్నాయి.

వృత్తిపరీక్షల బోర్డు(వ్యాపమ్) కుంభకోణంలో వరుస మరణాలపై దేశవ్యాప్తంగా కలకలం రేగుతున్న తరుణంలో ఈ కేసులో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 50కి చేరిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా, వ్యాపం స్కామ్‌లో నాలుగు నెలల క్రితం ఎస్టీఎఫ్‌ విచారణకు హాజరైన పోలీస్‌ కానిస్టేబుల్‌ మంగళవారం శవమై కనిపించాడు. ఈ సంఘటన తకంఘర్‌లో జరిగింది. రమాకాంత్‌ పాండే అనే పోలీస్‌ కానిస్టేబుల్ సోమవారం మధ్యాహ్నం నుంచి విధులకు హాజరు కావడం లేదు. కుటుంబసభ్యులు కూడా ఆయనను చూడలేదు.

మంగళవారం తోటి సిబ్బంది క్వార్టర్స్‌కు వెళ్లి చూడగా పాండే సీలింగ్‌ ప్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. కానిస్టేబుల్‌ చావుకు, వ్యాపం స్కామ్‌కు సంబంధం లేదని పోలీస్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మద్యం, జూదానికి అలవాటుపడిన రమాకాంత్‌ రుణభారంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఇది వ్యాపంకు సంబంధించిన హత్యే అని.. దీంతో మృతుల సంఖ్య 50కి చేరిందని ఆరోపిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vypam scam  MP constable  Ramakant Panda  

Other Articles