ABCD 2 Actor Nilesh Nirbhavane Behind Bars For Raping A 14-Year-Old Specially Abled Girl

Abcd 2 dancer nilesh nirbhavane arrested for gang raping mentally challenged girl

ABCD 2, actor, rape, arrested, bollywood news, Actor Nilesh Nirbhavane Behind Bars, Actor Nilesh Nirbhavane, back-up dancers of ABCD 2, mentally challenged girl, gang rape, Pant Nagar Police, sexual abuse, Nilesh Nirbhavane rape case, ABCD 2 dancer, Rape case, Gang Rape, crime against women, violence against women, harrasment against women

Nilesh Nirbhavane, one of the back-up dancers of ABCD 2, has been arrested for raping a 14-year-old specially-abled girl.

గ్యాంగ్ రేస్ కేసులో ఏబిసిడి-2 నటుడు నీలేష్ నిర్భావనే అరెస్టు..

Posted: 07/03/2015 12:26 PM IST
Abcd 2 dancer nilesh nirbhavane arrested for gang raping mentally challenged girl

నటుడిగా గుర్తింపు రాగానే సరిపోదు.. యువతను, సమాజాన్ని సన్మార్గంలో నడిపేందుకు కూడా వారు కృషి చేయాలి. అలా అని సమాజానికి మేలు చేసేందుకు వారు ఎప్పటికప్పుడు సమాజహిత కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. కనీసం సభ్య సమాజం తలదించుకునే చర్యలకు పాల్పడకపోతే అదే పది వేలు. ఏబిసిడి-2 సినిమా నటుడు నీలేష్ నిర్భావనే ఇలా చేయకూడని పనిచేసి ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. మతిస్థిమితం లేని ఓ మైనర్ బాలికపై నీలేష్ సహా అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ కేసుకు సంబంధించి 14 ఏళ్ల మతిస్థిమితం లేని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు నిజానిజాలు నిర్థారించుకున్న ముంబై పంత్ నగర్ పోలీసులు నటుడు నీలేష్ నిర్భావనేతో పాటు అతడి స్నేహితుడిని కూడా నిందితుడిగా గుర్తించనట్టలు తెలిపారు. ఇందులో భాగంగా ఇవాళ నీలేష్ ను కటకటాల వెనక్కి నెట్టారు. బాధితురాలి వ్యవహర శైలి, ప్రవర్తనలో మార్పు గమనించిన బాలిక టీచర్ అత్యాచారం జరిగిందని గుర్తించి అమె తల్లిదండ్రులకు, ఆపైన పోలీసులకు సమాచారం అందించారు.

తన స్నేహితుడితో కలసి బాధితురాలని ఎవరూ లేని ప్రాంతాలకు, టాయిటెల్లలోకి తీసుకువెళ్లిన నీలేష్ నిర్భావనే పలుమార్లు ఆ బాలికపై ఘోరానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని అతడు విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి నిర్భయ చట్లం కింద కేసు పెట్టామని వివరించారు. కాగా, ఏబిసిడి -2 చిత్రంలో అద్భుత నృత్య ప్రదర్శనలు చూపిన టీంలో నీలేష్ సభ్యుడిగా  నటించాడు. కెరీర్ కు బ్రేక్ వచ్చిన సమయంలో దారుణమైన ఘటనలకు పాల్పడి తన కెరీర్ ను నాశనం చేసుకోనున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ABCD 2  Nilesh Nirbhavane rape case  gang rape  bollywood news  

Other Articles