Telangana, Formation day, June2, KCR

Telangana formation day celebrations going more special

Telangana, Formation day, June2, KCR

Telangana formation day celebrations going more special. The telangana govt celebrating prestigely its first formation anniversary.

ప్రత్యేకం: పొడిచిన తెలంగాణం.. నాలుగు కోట్ల ప్రాణం

Posted: 06/01/2015 07:40 PM IST
Telangana formation day celebrations going more special

కళ్లెదుట ఆవిష్కృతమైన తెలంగాణ.. గుండెల్లో అమరుల జ్ఞాపకాలు.. ఆకాశమే హద్దుగా సాగిన జై తెలంగాణ నినాదాలహోరు మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆదివారం అర్ధరాత్రి పురుడుపోసుకుంది. 60 ఏళ్ల పోరాటం, అనేకమంది అమరవీరుల త్యాగాలఫలం సాక్షిగా తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో ఓలలాడారు.  సంయుక్త ఆంధ్రప్రదేశ్‌కు వీడ్కోలు పలుకుతూ తెలంగాణ రాష్ట్రంగా జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.  ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణం మొత్తానికి ఫలించింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణను 29 వ రాష్ట్రంగా ఏర్పరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తరతరాల పోరాటం తరువాత దక్కిన తెలంగాణ ఆవిర్భావం రోజు ఉద్యమకారులు ఆనందపడ్డారు. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి సంవత్సరం కావస్తున్న వేళ తెలుగు విశేష్ ప్రత్యేక కథనం..

కొత్త పొద్దు పొడిచింది. కోటి ఆశలతో నిరీక్షిస్తున్న తెలంగాణ నేలను కొత్త వేకువ పలకరించింది. కొత్త రాష్ట్రం సాధించిన సంబరంతో కోట్ల ప్రజానీకం పులకరించింది. తెలంగాణ సమాజపు అరవ య్యేళ్ల సుదీర్ఘ అస్తిత్వ పోరాటం ఫలించింది. స్వాభిమానం, స్వపరిపాలన కోసం దశాబ్దాలుగా సాగిన సబ్బండవర్గాల ఉద్యమం లక్ష్యాన్ని చేరింది. అసంఖ్యాకమైన ఆత్మబలిదానాలు, అనేకానేక ఉద్యమ గాయాల సాక్షిగా సువిశాల భారతావనిలో తెలంగాణ అవతరించింది... 29వ రాష్ట్రంగా సగర్వంగా ఉనికిలోకి వచ్చింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న బంగరు స్వప్నం నేటితో సాకారమైంది. ఊరూవాడా, పల్లేపట్నం, చిన్నాపెద్దా తేడా లేకుండా అర్ధరాత్రి నుంచే తెలంగాణ సమాజం సంబురాలు జరుపుకుంటూ కొత్త రాష్ట్రానికి, తమ సొంత రాష్ట్రానికి ఘనంగా స్వాగతం పలికింది. ఆనందం అర్ణవమైంది. తెలంగాణ ప్రజల సంబరం అంబరాన్నంటింది!

జూన్ 2 భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. యావత్ తెలంగాణ కలలుగన్న రోజు. జీవితంలో ఏ ఒక్కరూ మర్చిపోలేని రోజు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు పట్టలేని ఆనందంతో సంబరాలు నిర్వహించిన తీరు నభూతో నభవిష్యత్. తెలంగాణలోని ప్రతి పల్లె, పట్నం, ఊరు, వాడ, చిన్నా, పెద్దా తేడా లేకుండా వేడుకలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. జూన్ 1 అర్ధరాత్రి 12 గంటలకు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ పది జిల్లాలలో మారుమోగిపోయాయి. జై తెలంగాణ నినాదాలు, సాంస్కృతిక వేడుకలు, పటాకుల మోతలతో తెలంగాణను 29వ రాష్ట్రంగా ప్రజలు ఆహ్వానం పలికారు.

అలా ఘన స్వాగతం నుడుమ మళ్లీ పురుడు పోసుకున్న తెలంగాణ తల్లి నిజంగా పులకించి నేటికి ఏడాది పూర్తైంది. తన పిల్లల ఆత్మహత్యలను, ఎంతో మంది తల్లుల కడుపుకోతను అనుభవించిన తల్లి ఓ కంట నవ్వుతూ, మరో కంటి ఏడుస్తూ తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి బయలుదేరింది. అలా జూన్ రెండు రాత్రి పన్నెండింకి వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఆకాశమే హద్దుగా సంబరాలు జరిగాయి. చరిత్ర పుట్టో నిలిచిపోయే.. ప్రతి తెలంగాణ బిడ్డ మది పులకరించేలా.. ప్రతి త్యాగమూర్తి జీవితం సార్థకమయ్యేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హయాంలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. అయితే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరింత ఉత్సాహాన్నిచ్చాయి.

 


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Formation day  June2  KCR  

Other Articles