Hormone, Switzerland, scientist, testostiron

Switzerland scientists discover that corruption will done by homone effect

Hormone, Switzerland, scientist, testostiron

Switzerland scientists discover that corruption will done by homone effect. On Revanth reddy case the new study updates very interesting.

రేవంత్ రెడ్డి అలా చెయ్యడానికి ఆ హర్మోన్ కారణమా..?

Posted: 06/01/2015 07:20 PM IST
Switzerland scientists discover that corruption will done by homone effect

వెన్నుపోటు నీ రక్తంలో ఉందిరా.. మీ నాన్న అంతే..  నువ్వు కూడా అంతే.. అంటే చాలా సార్లు అంటుంటారు. మనం వింటుంటాం కూడా. అయితే తాజాగా ఓ అధ్యయనంలో తేలిన విషయం వింటే నిజంగా అవాక్కవుతారు. అయితే సీరియల్ లో చూపించినట్లు అవాక్కు కాదు అంతకన్నా ఎక్కువే. ఇంతకీ విషయం ఏంటీ అంటే అవినీతి ఎక్కువగా చేస్తున్నారు అంటే వారిలో ఓ రకమైన హర్మోన్ ఎక్కువగా ఉంటుందట. అందుకే వాళ్లు అవినీతికి తెగబడతారట. మొత్తానికి సైంటిస్టులు భలే విషయాలను కనిపెట్టారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అవినీతి మకిలీ అంటిన రేవంత్ రెడ్డి మ్యాటర్ హాట్ న్యూస్ గా మారిన టైంలోనే ఇలా అధ్యయన విషయం బయటకు రావడం నిజంగా యాదృచ్చికమే.

పురుషుల్లో సెక్స్ వాంఛను ప్రేరేపించే ‘టెస్టోస్టెరాన్’ హార్మోన్ ఎక్కువగా ఉన్న రాజకీయ నేతల్లో అవినీతి ఎక్కువగా ఉంటుందట. ఈ విషయం స్విడ్జర్లాండ్‌లోని లాసన్నే విశ్వవిద్యాలయం నిపుణులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవుల్లో వృషణాలు టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయనే విషయం తెల్సిందే. ‘అధికారం అవినీతికి దారి తీస్తుంది. తిరుగులేని అధికారం అంతులేని అవినీతికి ఆస్కారమిస్తుంది’ అని చెప్పిన ఇంగ్లీష్ క్యాథలిక్ హిస్టారియన్, బ్రిటన్ పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఎంపీగా పని చేసిన రాజకీయవేత్త, రచయిత సర్ జాన్ డాల్‌బెర్గ్-యాక్షన్.... కొటేషన్‌లో వాస్తవాలను తెలుసుకునేందుకు లాసెన్నే విశ్వ విద్యాలయానికి చెందిన ప్రోఫెసర్ జాన్ ఆంటోనకిస్ నాయకత్వంలోని నిపుణుల బృందం జరిపిన తాజా అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

మొత్తానికి అవినీతి చేస్తున్నాడు అంటే వారి రక్తంలో హార్మోన్ల ప్రభావం వల్లే అంతే తప్ప అందులో అతడి తప్పు ఏమీ లేదని పరోక్షంగా అంటున్నారు సైంటిస్టులు. అయినా జీన్స్ ఎపెక్ట్, హర్మోన్ల ప్రభావం ఉంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు లెండి. అయితే స్విడ్జర్లాండ్‌లోని లాసన్నే విశ్వవిద్యాలయం మ్యాటర్ తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు తెలిస్తే మాత్రం రేపు ఉదయాన్నే కోర్టులో పిటిషన్ వేస్తారోమో. తమ నాయకుడు కేవలం హార్మోన్ల ప్రభావం వల్లే అలా చేసి ఉంటాడు అంతే కానీ అతనికి ఎలాంటి దురుద్దేశం లేదు అంటూ కోర్టులో పిటిషన్ వేసినా ఆశ్చర్యపోనవసరం లేదేమో మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Hormone  Switzerland  scientist  testostiron  

Other Articles