Drunk and drive | hyderabad | lady doctor | Police

Dunken a lady doctor show cinema to police in hyderabad

Drunk and drive, hyderabad, lady doctor, Police

Dunken A lady doctor show cinema to police in hyderabad. a lady doctor drunk more than permit, the police stoped her and asked for breath analiser.

ITEMVIDEOS: అర్దరాత్రి పోలీసులకు సినిమా చూపించిన లేడీ డాక్టర్

Posted: 05/30/2015 11:01 AM IST
Dunken a lady doctor show cinema to police in hyderabad

అర్దరాత్రి సినిమా చూపించిన లేడీ డాక్టర్ అనగానే ఎక్కడ...? ఎలా..? అనే డౌట్ వస్తుంది. అయితే అన్నింటికి సమాధానాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి. తప్పతాగిన కొంత మంది వ్యక్తులు అర్థరాత్రి పోలీసులకు చుక్కలు చూపుతున్నారు. అందులో లేడీస్ ఏం తీసిపోవడం లేదు. తాజాగా హైదరాబాద్ లో ఓ లేడీ డాక్టర్ అర్థరాత్రి దాదాపు రెండు గంటపాటు చుక్కలు చూపించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ లేడీ డాక్టర్ చుక్కలు చూపింది. అర్ధరాత్రి ఖాకీలను పరుగులు పెట్టించింది. ఓ ప్రైవేటు హాస్పటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న మంజు అనే మహిళ, రోడ్ నెం 45లో తన కారుతో జోరుగా దూసుకెళ్లింది. డ్రండ్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఖాకీలను చూసి సడెన్‌గా బ్రేకులేసింది.  ఖాకీలు ఆమెను చూసేలోపే కారులోనుంచి పరుగులు పెట్టింది. ఆమెను ఛేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు.

ముందు పోలీసులను దబాయించిన డాక్టర్ మేడమ్, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు ససేమిరా అంది. ఖాకీలను కన్వీన్స్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. ఈ విషయం తన భర్తకు తెలిస్తే గొడవ జరుగుతుందని మారం చేసింది. మర్యాదగా డీల్ చేసిన పోలీసులు, లేడీ కానిస్టేబుల్ సాయంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేశారు. 32 శాతం ఆల్కహాలు డాక్టర్ తీసుకున్నట్లు తేలింది. ఆమె దగ్గరున్న డాక్యుమెంట్లు, మొబైల్‌ను పరిశీలించిన పోలీసులు, చలానా రాసి డాక్టర్ వద్ద సంతకం తీసుకున్నారు. ఫైన్ వసూలు చేయడంతోపాటు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తేల్చిచెప్పారు. అయినా ఇంట్లో గొడవ అవుతుందన్న భయం ఆ లేడీ డాక్టర్ లో ఉంటే అలా తప్పతాగి రోడ్ల మీద తిరుగుతుందా..? అని కొంత మంది అనుకుంటున్నారు. కానీ ఈ ఘటనలో మాత్రం పోలీసుల ఓపికకు మాత్రం హాట్సాఫ్ చెప్పాల్సిందే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunk and drive  hyderabad  lady doctor  Police  

Other Articles