nandamuri Balakrishna | Mahanadu | NTR | TDP

Nandamuri balakrishana didnt get expected responce in tdp mahanadu

nandamuri Balakrishna, Mahanadu, NTR, TDP, Telugudesamparty

Nandamuri Balakrishana didnt get expected responce in Tdp Mahanadu. In the cinemas Balakrishna dialouges make sensation in theaters.

ITEMVIDEOS: బాలకృష్ణ గారూ.. డైలాగులు లేవు.. చప్పట్లు లేవు

Posted: 05/30/2015 01:16 PM IST
Nandamuri balakrishana didnt get expected responce in tdp mahanadu

తెలుగు సినిమా హీరోల్లో బాలకృష్ణ అంటేనే ఓ స్పెషల్ అట్రాక్షన్. ఆయన డైలాగులు. ఛూడు ఒకవైపే ఛూడు రెండో వైపు చూడాలనుకోకు అన్న డైలాగ్ వస్తే దియేటర్లలో విజిల్స్, కేకలు ఇలా.. ఒక్క డైలాగే కాదు చాలా డైలాగులు ఆయన చెబుతున్నారంటే ధియేటర్ దద్దరిల్లాల్సిందే. అయితే సినిమాలో అదరగొట్టే నందమూరి నటసింహం నిజంగా అరదగొడారా అంటే అంత సీన్ లేదు అన్న సమాధానం వస్తుంది. ఎందుకంటే సినిమాల్లో చెప్పే డైలాగుల్లో బాలకృష్ణ చూపించే వాయిస్, పంచ్ లో క్లారిటీ మామూలుగా చూపించలేరు. నిన్నటి మహానాడు సభలోనూ బాలకృష్ణ పరిస్థితి ఇలానే ఉంది. అదిరిపోయే డైలాగులు ఏమోకానీ మహానాడులో బాలకృష్ణ స్పీచ్ లో ఇన్పర్మేషన్ ఉంది కానీ వినడానికి ఏ మాత్రం ఇంట్రస్టింగ్ గా లేదు.

మహానాడు మూడవ రోజు బాలకృష్ణ ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించడినికి నందమూరి తారకరామారావు చేసిన కృషి దగ్గరి నుండి ఆయన ప్రవేశపెట్టిన పథకాల వరకు అన్నింటి గురించి చాలా క్లారిటీతో చెప్పారు. కానీ బాలకృష్ణ అంటే డైలాగులు గుర్తుకు వచ్చే వారికి ఆ మాటలు అస్సలు రుచించలేదు. ఎదుటి వాడి గుండెల్లో దడ పుట్టించే బాలకృష్ణ డైలాగులు మహాసభలో మాత్రం కనీసం మనస్పూర్తిగా చప్పట్లు కొట్టించలేకపోయాయి. తెలుగుదేశం పార్టీ గురించి చాలాసేపు మాట్లాడినా కనీస రెస్పాన్స్ రాకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. హిందుపురం ఎమ్మెల్యేగా గత కొంత కాలంగా టిడిపిలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ తన స్పీచ్ తో మహానాడులో మాత్రం కార్యకర్తలను ఆకట్టులేకపోయారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandamuri Balakrishna  Mahanadu  NTR  TDP  Telugudesamparty  

Other Articles