23 foreigners arrested in shameerpet for obscene dances

Obscene dances in shamirpet resort 23 foreigners arrested

obscene dances in shamirpet resort, 23 foreigners arrested, foreigners arrested, shameerpet, resorts, somalia, maogolia, nigeria, leonia resort, rangareddy district, special operations team, cyberabad police

23 foreigners who indulge in obscene dances in shamirpet resort, arrested by sot police

రిసార్టులో అసభ్యనృత్యాలు, 23 మంది విదేశీయుల అరెస్టు

Posted: 05/17/2015 11:22 AM IST
Obscene dances in shamirpet resort 23 foreigners arrested

ఆ రిసార్ట్ కు మంచి పేరుంది. ప్రతీ వారంతం ఎన్నో ప్రముఖ సంస్థలు, వ్యక్తిగతంతా పౌరులు సైతం ఆ రిసార్టుకు వెళ్లి సరదాగా గడుపుతుంటారు. ఆలాంటి రిస్టార్ ఇవాళ వార్తల్లో నిలిచింది. అసభ్య నృత్యాలకు నెలవుగా మారి పరువు పోగోట్టుకుంది. విదేశీ వనితలతో అసభ్యకర నృత్యాలు చేయిస్తన్నందుకు రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని లియోనియా రిసార్ట్స్ వార్తలోక్కికెక్కింది. గత రాత్రి జరిగిన ఈ ఘటనపై లియోనియా రిసార్ట్స్ యాజమాన్యం పెదవి విపడం లేదు. అయితే పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా వున్నాయి.రంగారెడ్డి శామీర్ పేటలోని లియోనియా రిసార్ట్ లో శనివారం రాత్రి విదేశీయులతో కళకళలాడింది. సంబరాలు జరిగుతున్న క్రమంలో అకస్మాత్తుగా  సొమాలియా, మంగోలియా చెందిన విదేశీ వనితలు అర్థనగ్నంగా నృత్యాలు చేయడం ప్రారంభించారు. వారితో పురుషులు కూడా నృత్యాలు చేశారు.

దీనిపై సమాచారం అందుకున్నఎస్వోటీ పోలీసులు శనివారం అర్థరాత్రి అకస్మాత్తుగా దాడి చేశారు. దాదాపు 23 మంది విదేశీ యువతి, యువకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన యువతియువకులంతా సొమాలియా, మంగోలియాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో 8 మంది మహిళలు 15 మంది పురుషులు ఉన్నారని పోలీసులు చెప్పారు కాగా అరెస్టు చేసే క్రమంలో వీరు పోలీసులతో వాగ్వాదానికి దిగారని, సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : foreigners arrested  shameerpet  resorts  leonia  

Other Articles