Former CM Omar Abdullah slams central government over waving of Pakistani flag

Former cm omar abdullah hits out at bjp over waving of pakistani flag

Former CM Omar Abdullah, jammu and kashmir, Omar Abdullah, Pakistan flag, separatist rally, twitter, National Conference leader Omar Abdullah, BJP, waving of Pakistani flags, Kashmir.separatists, central government, home ministry, defence ministry, mukti mohommad syed, JK chief minister,

National Conference leader Omar Abdullah on Friday hit out at BJP for maintaining silence over waving of Pakistani flags during a rally by separatists in Kashmir.

బీజేపి అసలు నైజం ఇదే.. నేనున్నా ఇలానే వుండేవారా..?

Posted: 05/02/2015 07:16 PM IST
Former cm omar abdullah hits out at bjp over waving of pakistani flag

జమ్మూకాశ్మీర్ లో వేర్పాటు వాదులను విడుదల చేయాలంటూ నిన్న వేర్పాటు వాది సయ్యద్ జిలానీ ఆద్వర్యంలో కాశ్మీర్ లో ర్యాలీ నిర్వహించిన సందర్భంగా దాయది దేశం పాకిస్థాన్ జెండాలను ఊపుతూ ర్యాలీ కోనసాగింది. జమ్మూలోని కాశ్మీర్ పట్టణంలో ట్రాల్ పట్టణంలో జరిగిన ర్యాలీలో వేర్పాటు వాదులు హురియత్ కాన్ఫరెన్స్ నిర్వహించి వేర్పాటు వాదులు పాకిస్థాన్ జెండాలను ఊపారు. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ, పిడిపీ పార్టీ అధికారం చేపట్టిన తరువాత ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది రెండో సారి. దీనిపై ఇవాళ ప్రతిపక్షాలతో పాటు పలు పార్టీలు జిలానీ చర్యలకు వ్యతిరేకంగా అందోళన నిర్వహించాయి. అయితే ఈ వరుస ఘటనలపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా కూడా స్పందిచారు.

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా తాను.. ముంబైలో సినీతారాలతో కలసి సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఇలా జమ్మూకాశ్మీర్ లో పాక్ జెండాలు రెపరెపలాడి వుంటే.. బీజేపి ఇలానే స్పందిచేదా..? ఇంతే మౌనంగా వుండేదా అని ఆయన తన సామాజిక మాద్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బీజేపి తన మిత్రపక్షం పిడిపీ అధికారంలో వున్నందునే ఇలా మౌనంగా వుందని, తాను అధికారంలో వుంటే నానా హంగామా చేసే పార్టీ ద్వంద నీతి బయటపడిందని చెప్పారు. ఇదే బీజేపి అసలు నైజం అన్నారు.

కాగా, వేర్పాటు వాది జిలానీపై చర్యలు తీసుకుంటామని జమ్మూకశ్మీర్ సీఎం మూఫ్తీ మహమూద్ సయీద్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాద నేతల అరెస్టును నిరసిస్తూ సయ్యద్ జిలానీ ర్యాలీ నిర్వహించారు. పాకిస్థాన్ జెండాలను పట్టుకొని వారు ర్యాలీ చేశారు. పాకిస్థాన్ జెండాలతో ర్యాలీ చేయడాన్ని ఖండిస్తూ పలుసంఘాలు ఈరోజు ఆందోళన నిర్వహించాయి. జిలానీపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Omar Abdullah  Pakistan flag  separatist rally  twitter  

Other Articles