At Afghan Weddings, His Side, Her Side and 600 Strangers

600 strangers in reception

600 strangers in reception, At Afghan Weddings, His Side, Her Side and 600 Strangers Mumtaz Mahal wedding hall in Kabul, Mumtaz Mahal wedding hall Afghanistan, 600 extra people none of whom he recognized,

When Shafiqullah walked into his wedding celebration, he was surprised to find 600 extra people in the room, none of whom he recognized.

పిలవకుండానే వచ్చారు.. తిన్నారు.. వెళ్లారు..

Posted: 04/19/2015 01:55 PM IST
600 strangers in reception

సాధారణంగా పెళ్లి వేడుకలంటే అమ్మాయి తరుపు వారు, అబ్బాయితరుపు వారు, స్నేహితులు, బంధుమిత్రులు పెళ్లి పనులు చేసే వారుంటారు. కొన్ని పెళ్లి వేడుకల్లో పిలవకపోయినా వచ్చే అతిథులు సరాసరే! కాస్ట్లీ సూట్ లో వచ్చి ఎక్కువ బిల్డప్ ఇచ్చి.. తిని వెళ్లే వారు కూడా వస్తుంటారు. అక్కడున్న ఎవరో ఒకరితో తాము పరిచయం చేసుకుని తెగా మాట్లాడుతూ.. పీకల వరకు లాగించేస్తుంటారు. ఇది అన్ని చోట్లా జరిగే తంతే. అయితే ఇలాంటి పిలవని పేరంటానికి వచ్చి బొజనాలు గట్రా లాగించే వారు ఒక్కరో ఇద్దరో ఆపై ముగ్గురో.. లేదా వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో వుంటారు. కానీ ఊహించని విధంగా ఏకంగా ఆరు వందలమంది అమ్మాయి తరుపు, అబ్బాయి తరుపు కానీ అథిధులు పెళ్లి వేడుకకు వస్తే ఎలా ఉంటుంది అవాక్కయిపోరూ.. ఇలాంటి పరిస్థితే అప్ఘానిస్థాన్లో షాఫికుల్లా ఓ కార్ల వ్యాపారికి ఎదురైంది. తాను ఎంతో ఇష్టపడి ఏర్పాటుచేసుకున్న పెళ్లి వేడుకకు అనుకోని అతిథులు 600 మంది వచ్చారు.

వాళ్లలో ఏ ఒక్కరూ కూడా తెలిసినవారు లేకపోవడంతో అవాక్కయ్యాడు. పోనీ ఏదైనా అందామంటే పెళ్లిలో భోజనం పెట్టేందుకు కూడా కకృతి పడ్డావా అని అంటారేమోనని, చులకనగా చూస్తారేమోనని మదనపడ్డాడు. చివరికి వేరే దారేం లేక అప్పటికప్పుడు 600మందికి సరిపోయే భోజనానికి ఆర్డరిచ్చి తెప్పిచ్చాడు. ఆ విషయంపై స్వయంగా తానే ఓ మీడియాకు వెల్లడిస్తూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న తన పెళ్లి వేడుక గందరగోళానికి, రచ్చరచ్చకు తావివ్వకూడదనే ఊరుకున్నానని, అందరికీ విందు వడ్డించానని తెలిపాడు. ఈ ప్రాంతంలో ఒకరి భోజనం భరించడమంటే పర్సుకు భారీ చిల్లు పడ్డట్లే. అందుకే అతడు తెగ వర్రీ అయిపోయాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marriage  strangers  600 members  kabul  

Other Articles