Rahul and Sonia Gandhi attack Modi at farmers' rally, accuse PM of being anti-poor

Will fight war for farmers rahul gandhi says

Will fight war for farmers says Rahul Gandhi, Rahul and Sonia Gandhi attack Modi, manmohan singh slams modi, Congress declared war against modi sarkar, modi government "anti-farmer" and "pro-industrialist",

The Congress declared a full-scale war against the "anti-farmer" and "pro-industrialist" government over the land acquisition bill, with Rahul Gandhi accusing Prime Minister Narendra Modi of bringing an ordinance on it to pay back "loans" of industrialists.

ITEMVIDEOS: రైతు పక్షపాతి కాంగ్రెస్సే.. ల్యాండ్ బిల్లుపై పోరాటం ఆగదు

Posted: 04/19/2015 02:24 PM IST
Will fight war for farmers rahul gandhi says

దేశంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, రైతులను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రంగా విమర్శించారు. రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా.. వారి పక్షాన నిలిచి ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో సాంకేతిక విప్లవం కన్నా రైతు సంక్షేమం ముఖ్యమని రాహుల్ గాందీ అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన భూ సేకరణ చట్టంలోని మార్పులకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఆదివారం రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ కిసాన్‌ ర్యాలీ జరిగింది. ఈ సంర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ వర్గాల కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. విదర్భ, బుందేల్‌ఖండ్‌కు యుపీఏ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిందని, పేదలను పట్టించుకున్నది యుపీఏ ప్రభుత్వమేనని ఆయన ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

రైతు అనుకూల భూసేకరణ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం మార్చేస్తోందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. బలవంతంగా రైతుల వద్ద నుంచి భూమి లాక్కుంటోందని ఆయన మండిపడ్డారు. ఆదివాసీలను కలిశానని, వారి వికాసం కోసం ఎంత కృషి చేశారని ఆయన తెలిపారు. రైతులకు రుణ మాఫీ చేసింది కూడా యుపీఏ ప్రభుత్వమేనని రాహుల్‌ పేర్కొన్నారు. రైతుల రుణభారం తగ్గించేందుకు రూ. 70 వేల కోట్ల రుణమాఫీ చేశామని ఆయన వెల్లడించారు. ఆహారభద్రత చట్టం సహా పేదల కోసం అనేక పనులు చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ రైతుల సంక్షేమం కోసం పాటుపడిందని, ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల కోసమే పనిచేస్తుందని రాహుల్‌ విమర్శించారు.

ఎన్డీయే ప్రభుత్వంలో రైతులకు భవిష్యత్‌ లేదని రాహుల్‌ విమర్శించారు. ఐటీ కన్నా ముందు దేశంలో వ్యవసాయం ఉందని ఆయన అన్నారు. వ్యవసాయ విప్లవం గురించి ఆలోచించి రైతులకు మేలు కోసం భూ సంస్కరణ బ్లిల్లు తీసుకువచ్చామననారు. రైతులను ఇబ్బంది పెట్టి, ఉద్యోగాలు ఇవ్వకపోతే యువత నక్సలిజం వైపు మళ్లుతుందని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతున్నారని ఆయన విమర్శించారు. మోదీ విదేశీగడ్డపై భారత్‌ను విమర్శించడం తగదని రాహుల్‌ సూచించారు. భూసేకరణ బిల్లు తయారు చేసేందుకు మాకు రెండేళ్లు పట్టిందని, దాన్ని ఎన్డీయే ప్రభుత్వం ఇష్టానుసారంగా బిల్లులో సవరణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. రైతుల కోసం యుపీఏ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, బీజేపీ ప్రభుత్వం వచ్చి రైతులను నట్టేట ముంచిందని రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  sonia gandhi  manmohan  zameem wapasi  modi  

Other Articles