The Eiffel Tower | Celebrations | 126years

Eiffel tower completed 126 years in the world history

The Eiffel Tower, paris, google, doodle, gusav eiffel

The Eiffel Tower, one of Paris's most visited attractions, welcoming almost seven million visitors per year, was completed 126 years ago today - and there's a Google Doodle to mark the anniversary.

ప్రత్యేకం: అద్భుత కళాఖండానికి 126 ఏళ్లు @ ఈపిల్ టవర్

Posted: 03/31/2015 04:30 PM IST
Eiffel tower completed 126 years in the world history

ఈఫిల్ టవర్.. ప్రపంచంలో ఎవరికైనా పరిచయం ఉన్న పేరు. మానవ సృష్టికి మరో కొత్త అధ్యయనానికి ఈఫిల్ టవర్ కొత్త పేజీని తెరిచింది. 1889 మార్చి 31న చరిత్రలో ఓ కొత్త శకానికి నాంది పలికింది. ప్రపంచ చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తున్న ఈఫిల్ టవర్ నిర్మించి నేటికి 126 ఏళ్లు పూర్తైంది. కేవలం అందానికి చిరునామాగా కాకుండా రక్షణ, కమ్యూనికేషన్ కు ఎంతో ఉపయోగపడుతోంది ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని పూర్తి చేసి 126 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గూగుల్ సెర్చ్ ఇంజన్ లో లోగోను పెట్టింది.

ఈఫిల్ టవర్ చరిత్ర :
ఈ టవర్ ను గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ రూపొందించాడు. 1887 - 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని.. ఈ నిర్మాణ ఏర్పాటు కార్యక్రమాలను మొదలుపెట్టారు. నిజానికి ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనాలో ఈ టవర్ను నిర్మించాలనుకున్నాడు. కానీ అక్కడ నిర్మించడానికి కుదరలేదు. దాంతో ఈఫిల్ ఆ నిర్మాణానికి సంబందించిన వివరాలను పథకాన్ని ప్రపంచ ప్రదర్శన అధికారులకు ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. వాళ్లు దీనిని పరిశీలించిన అనంతరం అక్కడే 1889లో దీన్ని నిర్మించడం జరిగింది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ టవర్’ను కేవలం 20 సంవత్సరాలవరకు మాత్రమే వుండేటట్లుగా ఒప్పందం కుదిరింది. అంటే.. టవర్’ను రూపొందించే పనిలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా వుండాలని నియమం వుండేది. ఆ నియమం ప్రకారం దాన్ని 1909లోనే కూల్చివేయాలి. కానీ.. కాలక్రమంలో అది కమ్యూనికేషన్, మిలిటరీ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుండటంతో ఆ ఒప్పందం అయిపోయిన తర్వాత కూడా అలాగే వుంచేయడం జరిగింది. ప్రస్తుతం నేడు ప్రపంచంలోకెల్లా అత్యధిక పర్యాటకులు సందర్శించే టవర్ గా చరిత్ర రికార్డుల్లోకి ఎక్కిపోయింది.

ఆకారం..
ఈఫిల్ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు. అందులో లోహపు బరువు 7,300 టన్నులు. ఈ టవర్ ను నిర్మించేటపుడు చాలా మంది దాని ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయారట.  ఈఫిల్, ఇంజనీరింగ్ తో సంబంధం లేకుండా చూసే వీక్షకుడి మెప్పుకోసం దీన్ని రూపొందించాడని కొద్దిమంది విమర్శలు కూడా చేశారు. కానీ వంతెనల నిర్మాణంలో నిష్ణాతులైన ఈఫిల్, అతని బృందానికి మాత్రం తాము ప్రపంచంలోనే అతి ఎత్తైన నిర్మాణాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంగా తెలుసు. అందుకే బలమైన గాలులకు అది తట్టుకొనేటట్లుగా రూపొందించారు. ఏదేమైనా ఆ మహాద్భుత కట్టడాన్ని చూసేవారి థ్రిల్లింగే వేరు...

ప్రపంచంలో నిర్మించబడిన అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్ టవర్.. ప్యారిస్’లోని సీన్ నది పక్కన వున్న చాంప్ డి మార్స్ పై ఎత్తైన ఇనుప గోపురం. ప్యారిస్’లో ఎంతో ఎత్తైన ఈ నిర్మాణాన్ని.. గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ రూపొందించాడు. 1889 నుంచి నానాటికి దీన్ని సందర్శించే సంఖ్య మరింతగా పెరుగుతుండటంతో.. ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువ మంది సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.

మరిన్ని విశేషాలు :

* ఈ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు . ఇందులో వాడిన లోహాలు తుప్పుపట్టకుండా వుండేందుకు 7 ఏళ్లకోసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్’ను వాడుతారు.
* దీన్ని నిర్మించేటప్పుడు ఈఫిల్ 72 మంది ఫ్రెంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇందులో పాలుపంచుకున్నారు.
* 1889 సెప్టెంబర్ 10న థామస్ అల్వా ఎడిసన్ దీన్ని సందర్శించి.. అతి పెద్దదైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకు ఈఫిల్’కు అభినందనలు తెలియజేస్తూ గెస్ట్ బుక్’లో సంతకం చేశాడు.
*1902లో మెరుపుల ప్రభావంతో 100 మీటర్ల పైభాగం దెబ్బతింది. అప్పుడు టవర్’ని కాంతితో నింపే కొన్ని దీపాలను మార్చాల్సి వచ్చింది.
* 1910లో థియోడర్ ఉల్ఫ్ దీన్ని సందర్శించి.. టవర్ ఆడుగున, పైభాగాన విడుదలయ్యే ఉష్ణశక్తిని అంచనా వేశాడు. దాని మూలంగానే ఆయన కాస్మిక్ కిరణాలను కనుగొన్నాడు.
*1956 జనవరి 3న అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో టవర్ పైభాగం దెబ్బతింది.
* 1957లో టవర్ పైభాగాన ప్రస్తుతమున్న రేడియో యాంటెన్నాను అమర్చారు.

మరి ఇన్ని విశేషాలున్న ఈఫిల్ టవర్ ను మీరు సందర్శించాలనుకుంటే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ప్యారిస్ బయలుదేరాల్సిందే.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : The Eiffel Tower  paris  google  doodle  gusav eiffel  

Other Articles