Husband requesting to help them from there wives torcher | Gujarat latest updates

Husband requesting to help them from there wives torcher in gujarat

gujarat news, husband wife torcher, wives torchered husband, husbandss torcher, wives torcher, wives beating husbands, gujarat husbands news, gujarat latest news, gujarat government

Husband requesting to help them from there wives torcher in gujarat : In Gujarat state.. The married husbands calling to women's helpline department to save them their wives torcher.

భార్యల నుంచి కాపాడండంటూ మొరపెట్టుకుంటున్న భర్తలు

Posted: 03/31/2015 03:57 PM IST
Husband requesting to help them from there wives torcher in gujarat

ఇప్పటివరకు భర్తల చేతుల్లో భార్యలు బాధితులుగా మారిన సంఘటనలు ఎన్నో చూశాం కానీ.. తొలిసారి అందుకు విరుద్ధంగా భర్తలు ‘దయచేసి మా భార్యల నుంచి మమ్మల్ని కాపాడండోయ్’ అంటూ మొరపెట్టుకుంటున్నారు. ‘మా భార్యలు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాం.. దయచేసి మమ్మల్ని కాపాడండి’ అంటూ గుజరాత్లో మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ను కొందరు భర్తలు ఆశ్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.

మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు గుజరాత్ ప్రభుత్వం ‘పోలీసులు అభయం’ అనే హెల్ప్ లైన్ ప్రారంభించింది. అందుకోసం ప్రత్యేకంగా 181 అనే టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. మొదట్లో ఈ నెంబరుకు మహిళలు ఫోన్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేసేవారు కానీ.. ఇటీవలే కాలంలో ఆ నెంబర్కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. తమ భార్యలు మరీ దారుణంగా తమను హింసిస్తున్నారంటూ భర్తలు వరుసగా ఫోన్లు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.

ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా తమ భార్యలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గృహహింసకు కూడా పాల్పడుతున్నారని కొందరు భర్తలు హెల్ప్ లైన్కు ఫోన్ చేసి వాపోతున్నారట. అంతేకాదు.. వారి భార్యలు తమ తల్లిదండ్రులతో సరిగా మెదలడంలేదని, అలాగే అత్తల పోరు రానురాను మరీ ఎక్కువైపోతోందనివారు వాపోతున్నారట. ఎలాగైనా తమ భార్యలకు మంచి మార్గదర్శకాలు సూచించి వారిలో మార్పు తీసుకురావాలని వారు కోరుతున్నారని వివరించారు.

గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫోన్ కాల్స్ మొత్తం 7,919 ఉండగా.. వాటిల్లో మహిళలు ఫిర్యాదు చేసినవి 5,718 కాగా, పురుషుల చేసినవి 1,201. అయితే, కేవలం మహిళల కోసం ఏర్పాటుచేసిన ఈ హెల్ప్ లైన్ పురుషుల సమస్యలు పరిష్కరించాలని తాము అనుకోవడం లేదని అధికారులు అంటున్నారు కానీ.. విషయం తీవ్రంగానే ఉందని వారు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles