God will not bless these governments

god will not bless these governments, sharada peethadipati swarupananda saraswati, swarupananda saraswati, sarada pitham, godavari pushkarams, telangana government, Andhra pradesh government, swarupananda saraswati fires on chandrababu, swarupananda saraswati fires on kcr,

god will not bless these governments says sharada peethadipati swarupananda saraswati

సాములోరికి కోపం వచ్చింది.! ‘ఆధ్యాత్మికం పోయి అధికారం వచ్చింది’

Posted: 03/04/2015 05:46 PM IST
God will not bless these governments

స్వాములోరికి కోపం వచ్చింది. అదేదో ఆశామాషీ స్వాములోరు కాదు ఏకంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికే కోపం వచ్చింది. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా ఆధ్యాత్మిక వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోవడం, తమలాంటి మఠాధుపతులకు, పీఠాధిపతులను సంప్రదించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ దేవుడి ఆశీస్సులు వుండవని ఆయన మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలను ఆధ్యాత్మికంగా కాకుండా, అధికారికంగా నిర్వహించాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.

శ్రీరామ నవమి ఉత్సవాలను ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలనే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు. శ్రీరామ నవమి ఉత్సవాలు సహా గోదావరి ఫుష్కారాల నిర్వహణ ఇత్యాధి ఆధ్యాత్మిక విషయాలలో పీఠాధిపతులు, మఠాధిపతులను సంప్రదించకుండా, పక్కన పెట్టడం శోచనీయమని ఆయన అన్నారు. హైందవ మతాలకు మంచి జరుగుతుందనే.. ఈ ప్రభుత్వాలను గెలిపించేందుకు రోడ్ల మీదకు వచ్చామని స్వరూపానంద చెప్పారు. కానీ ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులను విస్మరించిన ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swarupananda saraswati  sarada pitham  godavari pushkarams  

Other Articles