Japanese cat island has more cats than people

japanese 'cat island' has more cats than people, cat island a must visit for cat lovers, Japan's Aoshima Island is cat lovers paradise, 120 feral cats live on cat island, cat island human to cat ratio is 1:6,

This island is a must visit for cat lovers. Japan's Aoshima Island is a paradise for cat lovers. More than 120 feral cats live on this island, where the human to cat ratio is 1:6.

ITEMVIDEOS: జపాన్ లోని మార్జాల ద్వీపం ప్రత్యేకత తెలుసా..?

Posted: 03/04/2015 05:44 PM IST
Japanese cat island has more cats than people

జపాన్ మార్జాల ద్వీపం ప్రత్యేకత గురించి చెప్పే ముందు.. అసలు మార్జాల ద్వీపం అంటే ఏమిటో కూడా తెలియాలి కదా.. మార్జాలం అంటే పిల్లి.. ద్వీపం అంటే చుట్టూ నీరుతో నిండిన భూభాగం.. దానినే ఇంగ్లీషులో ఐలాండ్ అని కూడా అంటారు. మరి పెంపుడు జంతువులైన పిల్లులకు ఒక ద్వీపం వుందంటే నమ్ముతారా..? మరో విషయం చెప్పాలంటే ఆ ద్వీపంలో మనుషుల కన్నా పిల్లుల సంఖ్యే అధికంగా వుందంటే విశ్వసిస్తారా..? కానీ ఇది నిజం. జపాన్ లోని ఓషిమా ద్వీపాంలో మనుషుల కంటే పిల్లుల సంఖ్యే అధికం. మరోలా చెప్పాలంటే మనుషుల కంటే ఆరు రెట్లు పిల్లులు వుంటాయి. వినడానికే విచిత్రంగా వున్న ఈ ద్వీపం పిల్లుల ప్రేమికులకు సర్గధామం. అందుకే ధీనిని పిల్లుల ద్వీపం అని కూడా పిలుస్తుంటారు.

ఇంతకీ ఇక్కడ ఇన్ని పిల్లులు ఎలా వచ్చాయన్న దానిపై కూడా కొన్ని కథలు ప్రచూర్యంలో వున్నాయి. రెండవ ప్రపంచ యుద్దం తరువాత పలువురు పింఛను తీసుకుంటున్న ఆర్మీ అధికారులు ఏకాంతంగా జీవితాన్ని గడపడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. అయితే ఇక్కడ ఎలుకలు అధిక సంఖ్యలో వుండి వారిని ఇబ్బందులు పెట్టడంతో వాటిని వేటాడే పనికోసం కొన్ని పిల్లులను తెచ్చారు. ఎలుకలు రమారమి సంహరణకు గురికాగా, పిల్లులు వాటి సంఖ్యను గణనీయంగా పెంచుకున్నాయని కథలు వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య 120కి చేరుకోగా మనుషులు మాత్రం కేవలం 20 మంది మాత్రమే ఇక్కడ నివాసం వుంటున్నారు.

పిల్లుల ప్రేమికులకు ఇది సర్గధామమే అయినప్పటికీ ఇది పర్యటక కేంద్రం మాత్రం కాదని, అందుకని పెద్ద సంఖ్యలో ఇక్కడ పర్యాటకులు ఎవర్వూ రారని జపాన్ వాసులు చెబుతున్నారు. హెలో కిట్టీ అన్న పేరుతో పిల్లుల కార్టూన్లు, వాటి బోమ్మలతో అనేక పిల్లల వస్తువులు తయారు చేసే సంస్థ ఉద్భవించిన జపాన్ లో పిల్లుల కోసం ప్రత్యేక ద్వీపం వుండటంలో అతిశయోక్తి ఏముందని పలువురు మార్జాల ప్రేమికులు వ్యాఖ్యానిస్తున్నారు.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Japan  Aoshima Island  Cat lovers paradise  Feral cats  

Other Articles