Barrack obama arrives at new delhi for three day tour

obama modi visit 2015, barrack obama, america president barrack obama, palam airport, narendra modi, prime minister modi, red carpet welcome, india welcomed obama, michelle obama, american first lady michelle obama

american president barrack obama arrives at new delhi for three day tour

ఒబామా దంపతులకు మోడీ.. సాదర స్వాగతం..

Posted: 01/25/2015 12:43 PM IST
Barrack obama arrives at new delhi for three day tour

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా దంపతులు భారతదేశ పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 9.40 గంటల సమయంలో అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్ ల్యాండయింది. భారత్ లో మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న అమెరికాలో బయలుదేరి ఇండియాకు చేరుకున్న అగ్రరాజ్య అధ్యక్షుడు ఒబమా, మిషెలి ఒబాయాకు భారత్ రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు అధికారులు సర్వ సన్నాహాలు చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా పాలెం విమానాశ్రయానికి చేరుకుని అమెరికా అధ్యక్ష దంపతులకు స్వాగతం పలికేందుకు ఎర్రటి శాలువా కప్పుకొని వచ్చారు. ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకొచ్చారు. ఆ వెంటే ఒబామా భద్రతాధికారుల వాహనం కూడా ఉంది. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు భారత దేశ పర్యటనకు వచ్చిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. అలాగే, గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా వస్తున్న మొదటి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే కావడం విశేషం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama modi visit 2015  narendra modi  red carpet welcome  

Other Articles