Narendra modi shakes a hand gives a hug to barrack obama

obama modi visit 2015, barrack obama, america president barrack obama, palam airport, narendra modi, prime minister modi, red carpet welcome, india welcomed obama, michelle obama, american first lady michelle obama, modi hugs obama, obama shake hands modi,

american president barrack obama shakes a hand as modi gives a hug to him

వెస్టన్ స్టైల్ షేక్ హ్యాండ్.. ఇండియన్ స్టైల్ హగ్..

Posted: 01/25/2015 01:06 PM IST
Narendra modi shakes a hand gives a hug to barrack obama

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు న్యూఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలం విమానాశ్రయానికి చేరుకుని, ఒబామా దంపతులకు విమానం వద్దే స్వాగతం పలికారు. ఒబామా దంపతులు ఉపయోగించే ద బీస్ట్ వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకురావడంతో.. దాని సమీపంలోనే స్వాగత కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్ధేశిత సమయం కన్నా సుమారు అరగంట ముందుగానే ఒబామా దంపతులు భారత్ చేరుకున్నారు.

ముందుగా ఒబామాకు పాశ్యాత స్టైల్ లో  షేక్ హ్యాండ్ ఇచ్చిన నరేంద్రమోదీ.. ఆ తర్వాత ఆయనను బలంగా భారత సంప్రదాయం ప్రకారం ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిషెల్ ఒబామా కూడా మోదీతో చేతులు కలిపారు. అనంతరం ఒబామా, మోదీ, మిషెల్ ముగ్గురూ చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, అక్కడి నుంచి ఒబామా దంపతులకు బస ఏర్పాటు చేసిన ఐటీసీ మౌర్య హోటల్ కు వారు చేరుకున్నారు. కాగా హోటల్ వద్ద కనీ వినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 మీటర్లకు ఒకటి చొప్పున హాలోజన్ దీపాలను ఏర్పాటుచేశారు. అక్కడకు సమీపంలో ఉన్న తాజ్ హోటల్ను కూడా భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బబామా పర్యటన సందర్భంగా ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు దళానికి చెందిన ప్రత్యేక స్నిఫర్ డాగ్ స్క్వాడ్ను రప్పించారు. సమీపంలో ఉన్న తాజ్ హోటల్ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama modi visit 2015  narendra modi  red carpet welcome  

Other Articles