Ghost spotted in delhi ncr

Ghost Spotted, Delhi. Noida, NCR, Scary Prank, White Sari, walking dead, People, scare, flee, capture, Camera., hilarious ghost

Ghost Spotted in Delhi NCR Most Scary Prank !

దయ్యాని నేరుగా చూసే ధైర్యం వుందా..?

Posted: 11/21/2014 01:28 PM IST
Ghost spotted in delhi ncr

అది దేశ రాజధాని, నిర్భయ సహా ఎందరో అమ్మాయిలు కోరికలు తీరకుండానే తనువు చాలించారు. కొందరివి ఆత్మహత్యలైయితే.. మరి కొందరివి హత్యలు. సామూహిక అత్యాచారాలు, అపై హత్యలు. ఢిల్లీ సహా ఉత్తర్ ప్రదేశ్ లో రోజుకో ఘటన చోటుచేసుకుంటుందంటే భయమనేది లేకుండా అక్కడి మదమృగాలు ఎంత భరితెగించారో అర్థమవుతోంది. పురుష అధిక్య, అహంకార సమాజంలో..మహిళలకు రక్షణ కరువయ్యేలా చేస్తున్నారు. ఇలాంటి దారుణాకాండలలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువతి ఆత్మగా మారి ఢిల్లీలో సంచరిస్తుందట. మరో మహిళకు అన్యాయం చేయకుండా రక్షణగా నిలుస్తుందట. నమ్మకం లేదా.. ? వీడియో చూడండి.

అలాంటి ఆత్మలు వున్నాయంటే తాము నమ్మం అనేవారు ఉన్నారు. మరికోందరు అత్మలా.. అవి మమ్మల్నేం చేస్తాయి అనే వారు వున్నారు. నిజంగా దెయ్యం కనబడగానే పరుగు లంకించుకుంటున్నారు. తెల్లని చీర ధరించి..ఢిల్లీ-నోడియా రోడ్డలోని దెయ్యం కనబడింది. కాళ్లకు చెప్పులు లేకుండా, చాలా నిదానంగా నడుస్తూ.. వెళ్లింది. దెయ్యాన్ని చూసి ధైర్యవంతులైన మగవారు.. పరుగలు తీసారు. అయితే ఈ దెయ్యం రాత్రి నుంచి వేకువ జాము వరకు సంచరించింది. వేకువ జామున వాకింగ్, జాగింగ్ చేసే వారు కూడా దెయ్యాన్ని చూసి దడిచి వెనకకు పరుగులు తీశారు.

అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని కొందరు ధైర్యవంతులు వీడియోలో బంధించారు. ఎవరెవరి దగ్గరికి దెయ్యం వెళ్లింది..? వారి ప్రతిస్పందన ఎలా వుందన్న అంశాలన్నింటినీ వీడియోలో బంధించారు. కాగా అది నిజమైన దెయ్యం కాదని, కేవలం కొందరు యువకులు చిలిపిగా చేసిన కార్యక్రమమని తెలుసుకున్న పలువురు.. హమ్మయ్య అంటూ నిట్పూర్చారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం చిత్రీకరించి యూ ట్యూబ్ లో అప్ టోడ్ చేయడంతో పలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే దెయ్యంమని భ్రమించి ఎవరైన భయస్తుడు నిజంగానే భయపడితే.. అతనికి ఏమనా జరిగితే.. పరిస్థితి ఏంటని ..? పలువురు ప్రశ్నిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ghost Spotted  Delhi. Noida  NCR  Scary Prank  White Sari  walking dead  People  scare  flee  capture  Camera.  hilarious ghost  

Other Articles