Hippopotamus attack kills 13 people including 12 children in boat near niger s capital niamey

Hippopotamus, attack, kills, 13 people, including 12 children, boat,Niger', capital city Niamey, west african country, governor, Tillaberi region, Hassoumi Djabirou

Hippopotamus attack kills 13 people, including 12 children, in boat near Niger's capital Niamey

హిప్పోదాడిలో 12 మంది చిన్నారులు మృతి

Posted: 11/21/2014 12:47 PM IST
Hippopotamus attack kills 13 people including 12 children in boat near niger s capital niamey

పశ్చివ అసియా దేశం నైగర్ రాజధాని నీయమీలో విషాదం చోటుచేసుకుంది. నీటి గుర్రం ( హిప్పొపోటమస్) దాడిలో 12 మంది విద్యార్థులు సహా 13 మంది మరణించారు. నియామీలోని నైగర్ నదికి ఒక పక్కనున్న నివాసాల నుంచి మరో వైపు నున్న పాఠశాలకు ఎప్పటిలాగానే పడవ ప్రయాణం చేస్తున్నారు ఆ విద్యార్థులు పడవలో మొత్తం 18 మంది వుండగా, వారిలో 12 మంది విద్యార్థులు ఉన్నారని వారంతా పది పన్నెండేళ్ల వయసున్న వారే. ఆ బడి పిల్లల బృందం రోజూ లాగే పడవ ఎక్కేశారు. ఆడుతూ... పాడుతూ నైగర్‌ నది మీద పడవ నెమ్మదిగా సాగుతోంది. ఇక కాసేపట్లో తమ పాఠశాల దగ్గర దిగటానికి అందరూ బ్యాగులు సర్దుకుంటున్నారు.

ఇంతలో ఒక్క సారిగా దబ్‌...మని భారీ చప్పుడు. చూస్తుండగానే పడవ మీదికి దూసుకొచ్చిన ఓ భారీ నీటిగుర్రం మళ్లీ మళ్లీ పడవను ఢీ కొట్టింది. ఏం చేయాలో తెలియని చిన్నారులంతా భయంతో కేకలు వేశారు. రెచ్చిపోయిన ఆ నీటిగుర్రం మళ్లీ మళ్లీ దాడికి తెగబడింది. దాని దాడి ధాటికి పడవ ఒక్కసారిగా నీటమునిగిపోయింది. దాంతో పడవలోని వారంతా నీటలో గల్లంతయ్యారు. నైగర్‌ దేశ రాజధాని నియామే సమీపంలోని లిబోర్‌ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకొంది. మృతులలో ఏడుగురు బాలికలు, 5 బాలలతో సహా ఓ గ్రామస్థుడు ఉన్నట్లు ఆ దేశ విద్యాశాఖ మంత్రి నిర్ధారించారు.

ముందుగా కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే మరణించారని మిగతావారు గల్లంతయ్యారని ప్రకటించిన అధికారులు.. మృతదేహాలను వెలికి తీయడంతో.. మృతుల సంఖ్య 13కు చేరింది. అయితే పడవపై హిప్పో దాడి చేస్తున్న సమయంలో మొత్తం 18 మంది వున్నారని అధికారులు తెలిపారు. మిగిలిన వారు క్షేమంగా వున్నారన్నారు. కాగా నీటిగుర్రం ఎక్కడుందో కనిపెట్టి కాల్చివేయాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేసినట్లు తిల్లాబెరీ ప్రాంత గవర్నర్ హోస్సోమి డవబిరో తెలిపారు. గత ఏడాది కూడా ఒక నీటిగుర్రాలు దాడులకు పాల్పడ్డాయని తెలిపారు. అవి నది వడ్డున గడ్డి మేసేందుకు వెళ్తున్న పశువులపై కూడా దాడి చేస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles