Victorias secret lingerie latest photos

victoria's secret bras, victoria's secret lingerie, victoria's secret 2014 bra photos, victoria's secret show london tickets, victoria's secret latest models photos, victoria's secret cat walk show photos, victoria's secret fantasy bra, world latest news, latest dress models, latest apparels

victorias secret lingerie latest photos : the lingerie giant victoria's Secret has revealed the most prized piece of the show. Brazilian models Adriana Lima and Alessandra Ambrosio will model the two Fantasy Bras at this year's Victoria's Secret catwalk

కోట్లు విలువ చేసే విక్టోరియా బ్రాలతో మోడళ్ళు

Posted: 11/14/2014 02:10 AM IST
Victorias secret lingerie latest photos

ఆడవారి లో దుస్తుల తయారి దిగ్గజం విక్టోరియా సీక్రెట్ సీక్రెట్ క్యాట్ వాక్ కు సిద్ధం అవుతోంది. డిసెంబర్ 9న జరిగే ఈ క్యాట్ వాక్ కోసం విక్టోరియా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాషన్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ షోకు మరింత క్రేజ్ తెచ్చేందుకు మోడళ్లతో కొన్ని ఫొటోలు విడుదల చేశారు. సాధారణంగా ఏడాదికి ఒకే ఖరీదైన బ్రా మోడల్ తయారు చేసి ప్రదర్శించే విక్టోరియా సీక్రెట్ ఈ సారి రెండు బ్రాలు తయారు చేసింది. బ్రెజిల్ కు చెందిన ప్రముఖ మోడల్స్ అడ్రియానా లిమా, అలెస్సాండ్రా అంబ్రెసియో ఈ ఖరీదైన బ్రాలు వేసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

Victoria-Bra-1

లక్షల విలువైన ఈ బ్రాలతో మోడళ్ళు, హొయలు పోతూ.., వివిధ భంగిమల్లో ఇచ్చిన స్టిల్స్ మతిపోగొడుతున్నాయి. అన్నట్లు ఈ ఫొటోలో మోడళ్ళు వేసుకన్న ఒక్కో బ్రా ఖరీదు దాదాపు రెండు మిలియన్ డాలర్లు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సిలో దీని విలువ దాదాపు 12కోట్ల రూపాయలకు పైనే అన్నమాట. తాజా బ్రాలలో ఒక్కో బ్రా తయారు చేయటానికి వీరికి 1380 గంటలు పడుతుందని కంపనీ వర్గాలు చెప్తున్నాయి. వీటిలో 16వేల రూబీలతో పాటు వజ్రాలు ఇతర విలువైన రాళ్ళు పొదిగారు. ఈ బ్రాలను స్విస్ కు చెందిన మౌవాద్ డిజైన్ చేశాడు. ఇందులో 16వేల రత్నాలో పాటు 18క్యారెట్ల బంగారంను ఉపయోగించి తయారు చేశారు.

Victoria-Bra-2

విక్టోరియా సీక్రెట్ కంపనీ అత్యంత ఖరీదైన బ్రాలు తయారు చేసే కంపనీగా పేరొందింది. 1996లో కంపనీ తయారు చేసిన తొలి బ్రా ఖరీదు ఒక మిలియన్ డాలర్లు అంటే ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఆరు కోట్ల రూపాయలు. దీన్ని ప్రముఖ మోడల్ క్లౌడియా షిఫ్ఫర్ ప్రదర్శించారు. అత్యంత ఖరీదైన రాళ్ళతో ఈ బ్రాలను తయారు చేస్తారు. ఇలా ఏటా ఒక్కో మోడల్ తయారు చేసి వాటిని ప్రదర్శించి అమ్మకానికి పెడతారు. వేలంలో ఇవి కోట్ల రూపాయలు ధర పలుకుతాయి. ఒకవేళ ఎవరూ కొనక పోతే మాత్రం ఆ మోడల్ ను తీసేస్తారు. అంటే ఇక ఆ బ్రా ఉండదు. అందులోని రాళ్ళు, వజ్రాలు అన్ని తొలగిస్తారు. 2000 సం.లో గిసిలి బుంద్చెన్ ప్రదర్శించిన బ్రా రికార్డు స్థాయిలో 15మిలియన్ డాలర్ల ధర పలికింది. ఇది అత్యంత ఖరీదైన బ్రాగా గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది కూడా.

Victoria-Bra-3

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : victoria's secret  fashion show  models  latest news  

Other Articles