Woman awarded 28000 euros after falling off in her own toilet

toilet, woman, Ireland, London, contractor, court, awarded, 28000 euros

woman awarded 28000 euros after falling off in her own toilet

రూ. కోటి తీసుకున్న ఆ వృద్దురాలు.. మహా ఘటికురాలు..

Posted: 10/19/2014 11:03 PM IST
Woman awarded 28000 euros after falling off in her own toilet

ఓ వృద్ధురాలును చూసి ఏమోలే అనుకున్నాడో ఏమో ఆనుకున్నాడనుకుంటా ఆ కాంట్రాక్టరు.. ఇప్పుడామె పేరేత్తితే.. వామ్మె ఆమేనా.. వృద్దురాలు కాదు.. మహా ఘటికురాలు అంటూ బిత్తరపోతున్నాడు. టాయిలెట్ కట్టినందుకే ఇంత చేసింది.? ఇక ఇల్లు కడితే ఇంకెత చేస్తుందోనంటూ ఆందోళన చెందుతున్నాడు. ఇంతకీ కాంట్రాక్టరునే బెదరగోట్టిన ఆ వృద్దురాలు కథ ఏంటో మీకు తెలుసా..? ఇంతకీ అమె ఎవరో కూడా మీకు తెలియదు కదూ..?

తన ఇంట్లోని టాయిలెట్ లో జారిపడినందుకు కాంట్రాక్టరు నుంచి 28 వేల యూరోలు ( భారత కరెన్సీలో రూ.99 లక్షలు) నష్ట పరిహారం పొందిందావిడ. అదేంటి మేము జారిపడతాం.. మాకూ కోటి రూపాయలు ఇస్తారా అనేగా మీ సందేహం.. అవిడలా పోరాడే పటిమే వుంటే మీకు కోటి రూపాయలు కాకపోయినా.. ఎంతో కొంత మాత్రం వస్తుందనుకోండి. అదెలా అంటారా..? సో రీడ్ ది స్టోరీ

ఐర్లాండ్ లో ఇసాబెలా సుల్లివాన్ అనే వృద్ధురాలు తన ఇంటి టాయిలెట్ లో జారిపడటంతో కోర్టును ఆశ్రయించింది. తన ఇంట్లో టాయిలెట్ ను అమర్చే క్రమంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే తాను జారిపడినట్లు ఫిటిషన్ లో స్పష్టం చేసింది.  దాంతో కుడి మోకాలికి తీవ్రంగా గాయమైనట్లు తెలిపింది.' కాంట్రాక్టర్ ఇంటి బాత్ రూంలోని టాయిలెట్ పనులు సరిగా చేయలేదు.  టాయిలెట్ పనులు చేసే సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ కారణంగానే నేను జారిపడిపోయాను' అంటూ పేర్కొంది.
 
దీనిపై విచారణ చేపట్టిన సర్క్యూట్ సివిల్ కోర్టు 28,000 యూరోలను ఆమెకు నష్టపరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసింది.  టాయిలెట్ సరిగా లేకపోయిన కారణంగా ఆమె గాయమై బాధపడినందుకు 25,000 యూరోలు చెల్లించాలని, టాయిలెట్ పనులు తిరిగి చేయడానికి 2,500 యూరోలతోపాటు, అదనంగా మరో 350 యూరోలు చెల్లించాలని కోర్టు కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : toilet  woman  Ireland  London  contractor  court  awarded  28000 euros  

Other Articles