Bollywood aamir khan warnings to briberies

aamir khan, bribe, curroption, india corruption, aamir khan corruption, bollywood actor aamir khan, aamir khan interview, aamir khan pk poster

bollywood aamir khan warnings to briberies : bollywood mister perfect aamir khan gaves a statement that he will complaint the police who ask him bribe

లంచం అడిగేవాళ్లకు సవాల్ విసిరిన అమీర్!

Posted: 08/21/2014 05:30 PM IST
Bollywood aamir khan warnings to briberies

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట అయిన అమీర్ ఖాన్.. లంచం అడిగేవాళ్లకు సవాల్ విసురుతున్నాడు. లంచం ఇవ్వడంగానీ.. తీసుకోవడంగానీ తన ఇంటవంట లేదని పేర్కొన్న అమీర్.. అటువంటి వాళ్లంటేనే తనకు ఎంతో అసహ్యం అని చిర్రెత్తుకొచ్చి చెబుతున్నాడు. ఇప్పుడైనా.. ఎప్పుడైనా తనను ఏ పనిలో అయినా ఎవరైతే లంచం అడుగుతారో.. వారికి అక్కడికక్కడే మాంచి గుణపాఠం నేర్పిస్తానని.. దమ్ముంటే ఎవరైనా ముందుకు రండంటూ అతను సవాల్ విసురుతున్నాడు.

తన తాజా చిత్రం ‘‘పీకే’’ పోస్టర్ల వివాదం అనంతరం.. రెండో పోస్టర్ ను విడుదల చేసి అందరినీ ప్రశాంతపరిచిన విషయం తెలిసిందే! అయితే మొదటి పోస్టర్ లో అమీర్ న్యూడ్ గా కనిపించిన దృశ్యం మీద వున్న అనుమానాలు కొంతమంది వ్యక్తపరిచారు. అలాగే సెన్సార్ విషయాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు లేవనెత్తిన సందర్భంలో ఒకరు.. ‘‘మీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎవరైనా లంచడం అడిగితే మీరేం చేస్తారు..? లంచం ఇస్తారా..?’’ అని అడిగిన దానికి ఘాటుగానే స్పందించాడు. తననెవరైనా సరే.. లంచం అడిగితే అప్పటికప్పడే పోలీసులకు ఫిర్యాదు చేసి, వారిని పట్టిస్తానని సమాధానం ఇచ్చాడు.

సెన్సార్ బోర్డు అధికారి రాకేష్ కుమార్ అరెస్టుపై స్పందించిన అమీర్.. తనను ఇంతవరకు ఎవరూ లంచం అడగలేదని స్పష్టం చేశాడు. ‘‘సత్యమేవ జయతే’’ టీవీ ప్రోగ్రాం ద్వారా దేశంలో జరుగుతున్న అన్యాయ, అక్రమాలను, ఆకృత్యాలను సమాజానికి తెలియజేసిన అమీర్.. లంచం మీద హితువులు పలికాడు. లంచం అనేది దేశంలో పాతుకుపోయిన జాఢ్యమని అభిప్రాయపడిన అతను.. అవినీతిని అంతం చేయాలంటే ఓ మనిషి వల్లగానీ, సినిమావల్లగానీ సాధ్యం కాదని.. ప్రతిఒక్కరు దీనికి వ్యతిరేకంగా గళం విప్పి భాగస్వాములు అయితేనే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. భారతదేశంలో జరుగుతున్న అవినీతిని అంతమొందించి, సమగ్ర భారత్ ను రూపుదిద్దాలంటే, ఆ బాధ్యత అందరిపై వుందంటూ ఆయన గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తుంటూ.. అమీర్ త్వరలోనే అవినీతిపై కార్యక్రమాన్ని నిర్వహిస్తాడనంలో ఎటువంటి అనుమానం లేదని అందరూ పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  pk movie  corruption  bride  cencor board  

Other Articles