Bjp president amit shah met chandrababu naidu

amit shah, bjp, bjp president, amit shah wiki, modi, rajnath singh, nda, upa, andhrapradesh, telangana, hyderabad, latest news, chandrababu naidu, tdp, government, tiffins, breakfast, treat, party

bjp president amit shah met chandrababu naidu in his home : amit shah went to chandrababu naidu's home for breakfast treat, discussed about recent political trends

టిఫిన్ కోసం బాబు ఇంటికెళ్ళిన అమిత్ షా í

Posted: 08/22/2014 09:19 AM IST
Bjp president amit shah met chandrababu naidu

మనం బయట టిఫిన్ కోసం ఎక్కడికెళ్తాం. మహా అయితే వీధి చివరి వరకు వెళ్తాం. మరీ ఎక్కువయితే ఓ కిలోమీటరు దూరం వెళ్తాం. అంతకు మించి అయితే మనకా టిఫిన్ అవసరం లేదంటాం. కాని బీజేపి అధ్యక్షుడు అమిత్ షా టిఫిన్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. బాబుగారి ఇంట్లో టిఫిన్ లో మరి అంతగా ఏం స్పెషల్ ఉందో.., షా గారికి అంతగా ఏం నచ్చిందో ఆయనకే తెలియాలి. అమిత్ షా ఈ ఉదయం టిపిన్ కోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. అయితే బాబు పిలిస్తేనే వెళ్ళారు లెండి. నగరానికి వచ్చిన అమిత్ షాను ఈ ఉదయం చంద్రబాబు నాయుడు అల్పాహార విందుకు ఆహ్వానించారు. బాబు విజ్ఞప్తి కాదనలేకపోయిన అమిత్ షా భారీ భద్రత మద్య, టైట్ సెక్యురిటీ ఉండే బాబు ఇంటికి వెళ్ళారు.


    టిఫిన్ తర్వాత ఇద్దరు నేతలు కొద్దిసేపు సమావేశం అయ్యారు. ఈ భేటిలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ, ఏపీల్లో టీడీపీ పరిస్థితి, పాలన అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్, వైఎఎస్సార్ కాంగ్రెస్ వ్యవహార శైలితో పాటు, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రాజకీయాలపై ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అయితే నగరానికి వచ్చిన అమిత్ షాను బాబు ఇంటికి పిలిచి మర్యాద చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలెవరూ కనీసం ఆయన్ను పలకరించకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షంతో మంచిగా ఉంటేనే పనులవుతాయన్న విషయం తెలంగాణ సర్కారుకు తెలియదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amit shah  chandrbabu naidu  breakfast treat  latest news  

Other Articles