Telugu man died with ebola virus in kenya

ebola virus news, ebola virus, telugu man gajendra reddy, gajendra reddy died with ebola virus, ebola virus latest news, ebola virus telugu man died, ebola virus india, telugu man gajendra reddy died ebola virus

telugu man died with ebola virus in kenya : An andhra man named gajendra reddy died with ebola virus in kenya

ఎబోలా వైరస్ కు బలైన తెలుగు వ్యక్తి!

Posted: 08/21/2014 04:24 PM IST
Telugu man died with ebola virus in kenya

ఎబోలా వైరస్.. ప్రపంచంలోని అగ్రదేశాలతోపాటు అందరినీ వణికించేస్తున్న ఒక ప్రాణాంతకమైన వ్యాధి! ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో నివాసముండే రెండు సంవత్సరాల పిల్లాడు నుంచి మొదలైన ఈ వైరస్... ఇప్పుడు ప్రపంచదేశాల్నే గడగడలాడించేస్తోంది. ఈ వైరస్ సోకిందంటే చాలు.. మరణం ఖాయం! ఇప్పటికే దాదాపు 1300మందికి పైగా ఈ వైరస్ కు బలైపోయారు. అంతెందుకు... ఈ వ్యాధి సోకినవారికి ఎన్నోజాగత్తలతో చికిత్స అందిస్తున్న డాక్టర్లు కూడా దీనికి కుప్పకూలిపోతున్నారు. దీంతో ఈ వ్యాధిసోకిన వారికి చికిత్స ఇవ్వడానికి డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ఇక వైరస్ సోకిన వ్యక్తులనైతే బయటికి వెళ్లినివ్వకుండా ఎక్కడున్నారో అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఒకవేళ వారు చనిపోతే.. ఎంతో భద్రతల మధ్య వారి శవాల్ని కాల్చకుండా పూడ్చేస్తున్నారు.

ఇదిలావుండగా.. ఈ వైరస్ మన భారత్ కు సంక్రమించిందనే వార్తలు అప్పట్లో బాగానే షికార్లు చేశాయి. ఆఫ్రికా నుంచి వచ్చిన చెన్నైకి వచ్చిన వ్యక్తికి ఎబోలా వైరస్ సోకిందంటూ వచ్చిన వదంతుల నేపథ్యంలో అతనికి శస్త్రచికిత్సలు చేసి, పరీక్షలు నిర్వహించగా అదంతా తప్పని తేలిపోయింది. అలాగే విదేశాల నుంచి పర్యటించేందుకు ముంబయికి వచ్చిన వ్యక్తి ఎబోలా వైరస్ బారిన పడ్డాడంటూ భారీగా పుకార్లు వచ్చాయి. అయితే ఆ వార్తలు కూడా వదంతులుగానే వుండిపోయాయి. ఇప్పుడు తాజాగా ఈ ఎబోలా వైరస్ ఒక తెలుగు వ్యక్తి బలైపోయాడు. చిత్తూరు జిల్లా పూతలపట్లు మండలం చిటిపిరాళ్ల ప్రాంతానికి చెందిన గజేంద్రరెడ్డి అనే తెలుగు వ్యక్తి ఈ ఎబోలా వైరస్ బారిన పడి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. అయితే ఈ వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందుతుందని భయాందోళనలకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇతను మరణించింది మన ఇండియాలో కాదు.. కెన్యాలో!

గత కొన్నేళ్లక్రితం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి ఉద్యోగ నిమిత్తం కెన్యాకు వచ్చిన ఈ తెలుగు వ్యక్తి.. అనుకోకుండా ఎబోలా వైరస్ కు గురయ్యాడు. మొదట దీని ప్రభావం అంతగా అనిపించలేదు కానీ.. రానురాను అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతను ఈనెల 4వ తేదీన తీవ్ర జ్వరంతో కెన్యాలోని నైరోబిలో ఆగాఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు చేరాడు. అప్పుడు ఇతను ఎబోలా వైరస్ కు గురయ్యాడని డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతుండగానే ఇతను 14వ తేదీన కోమాలోకి వెళ్లిపోయాడు. అనంతరం 18వ తేదీన మృతి చెందాడు. అయితే ఈ వార్త బుధవారం ఉదయం 10 గంటలకు తన భార్య, కుమార్తె బెంగుళూరుకు రావడంతో అక్కడ వెలుగులోకి వచ్చింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ebola virus  telugu people  gajendra reddy  ebola virus india  

Other Articles