Mars orbiter reaching destination in 75 days

Mars Orbiter reaching destination in 75 days, ISRO launched Mars Orbiter, Mars Orbiter to reach Mars on Sep 24

Mars Orbiter reaching destination in 75 days

అంగారక గ్రహం- మరో 75 రోజుల్లో

Posted: 07/12/2014 03:36 PM IST
Mars orbiter reaching destination in 75 days

శ్రీహరికోట నుండి నవంబర్ 5 2013 న లాంచ్ చేసిన మార్స్ ఆర్బిటర్ మరో 75 రోజుల్లో లక్ష్యాన్ని చేరనుంది.  భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవరహిత అంగారక గ్రహ యానం చేసే మార్స్ అర్బిటర్ నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకుంటుందని ఇస్రో చెప్తోంది.  

జూన్ 11 న విజయవంతంగా రెండవ ట్రాజెక్టరీ కరెక్షన్ మానివర్ చేసిన ఇస్రో మార్స్ ఆర్బిటర్ ని నిర్ణీత దిశవైపు అంతరిక్ష నౌకను మళ్ళించటం జరిగింది.  సెప్టెంబర్ లో లక్ష్యాన్ని చేరుకోవటానికి ముందుగా మరోసారి మార్స్ ఆర్బిటర్ దిశను మార్చే పనిని ఆగస్ట్ లో చెయ్యవలసివస్తుంది.  భూమితో పాటుగా ఇతర గ్రహాల స్థితులు కూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి ముందుగానే లెక్కవేసుకున్న విధంగా మార్స్ ఆర్బిటర్ దిశను మారుస్తూ వస్తున్నారు.  

ఇవన్నీ లెక్కించే సెప్టెంబర్ 24 కి ఈ రోదసీ నౌక అంగారక గ్రహం లోని వాతావరణంలోకి ప్రవేశిస్తుందని నిర్ణయించటం జరిగింది.  ఇంతవరకు విజయవంతంగా ప్రయాణం చేసిన మార్స్ ఆర్బిటర్ అదేవిధంగా మార్స్ ఆర్బిట్ లోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles