Polavaram project ordinance opposed by congress who are creators

Polavaram ordinance opposed by its originators Congress, Sonia and Rahul lack leadership qualities, Congress MPs oppose their party made ordinance

Polavaram project ordinance opposed by Congress who are creators of it

సోనియా, రాహుల్ చోద్యం చూస్తున్నారా?

Posted: 07/12/2014 03:53 PM IST
Polavaram project ordinance opposed by congress who are creators

వాళ్ళు ప్రవేశపెట్టిన పోలవరం ఆర్డినెన్స్ మీదనే చర్చ జరుగుతుంటే వాళ్ళ ఎంపీలో అడ్డు పడుతుండగా సోనియా రాహుల్ గాంధీలు చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారే కానీ అది మనం తయారు చేసిన ఆర్డినెన్సే, దాన్ని ఇప్పుడు తాజాగా చట్టబద్ధం చేసే పనిని చేపట్టిందే తప్ప భాజపా తప్పేమీ లేదిందులో అని చెప్పకపోవటాన్ని భాజపా నాయకులు తప్పు పడుతున్నారు.  దీనితో వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఏపాటి ఉన్నాయో కూడా అర్థమౌతున్నాయని అంటున్నారు.  

రాష్ట్ర విభజనకు తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ని, ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలపటాన్ని ప్రతిపాదిస్తూ చేసిన ఆర్డినెన్స్ అప్పుడు ఎందుకు చేసినట్లు, ఇప్పుడు ఎందుకు ప్రతిఘటిస్తున్నట్లు అని అడుగుతున్నారు.  అప్పుడేమో అది మంచిపనిగా తోచింది, ఇప్పుడు అదే రాజ్యాంగ విరుద్ధమైపోయిందా అని ప్రశ్నిస్తున్నారు.  

అంతేకాదు, మీరు తలుపులు మూసేసి, టివి ప్రసారాలను నిలిపివేసి రాష్ట్ర విభజన చేసారు కానీ మేము అలాంటివేమీ చెయ్యలేదు, పోలవరం ప్రాజెక్ట్ మీద ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి దానిమీద చర్చ కొనసాగించాం, ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాం అంటున్నారు భాజపా నాయకులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles