Mobile phone became part of our body than an instrument

Mobile phone became part of our body than an instrument, Mobile customization reveals individuality, Eastern parts customize phone more than Westerns

Mobile phone became part of our body than an instrument

మొబైల్ ఫోన్ పరికరమా, మనలో భాగమా?

Posted: 07/12/2014 03:00 PM IST
Mobile phone became part of our body than an instrument

పశ్చిమ దేశాలలో ఫోన్ పరికరమే కానీ తూర్పు దేశాలలో మాత్రం ఫోన్ ని సొంత శరీరంలో భాగంగా చూసుకుంటారనటానికి ఎవరికి వారు వారికి ఇష్టమైన రీతిలో కస్టమైజ్ చేసుకోవటమే తార్కాణం.  

అంతేకాదు ఫోన్ ని కస్టమైజ్ చేసుకునేదాన్నిబట్టి వాళ్ళ మనోదృష్టి, ప్రవర్తనలను అర్థం చేసుకోవచ్చంటారు దీనిమీద పరిశోధన చేసిన పరిశోధకులు. రింగ్ టోన్ దగ్గర్నుంచి వివిధ యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోవటం వరకు వాళ్ళ ఫోన్లలో ఉన్న వెసులుబాట్లను బట్టి వారి ఇష్టానికి తగ్గట్టుగా మార్చుకోవటం వారి వ్యవహారశైలిని, ప్రవర్తనావళిని తెలియజేస్తుందంటారు వాళ్ళు.  

మొబైల్ ఫోన్ ఈ కాలంలో అత్యంత అవసరమైన పరికరమైపోయింది.  బట్టలేసుకోవటమన్నా మర్చిపోతామేమో కానీ మొబైల్ ఫోన్ ని మర్చిపోమని అంటున్నాడు హిందీ సినిమారంగంలో యువ నటుడు అర్జున్ కపూర్.  మాట్లాడటానికే కాకుండా వినోదం కలిగించి పని వత్తిడిని తగ్గించటానికి కూడా ఫోన్ పనికివస్తుందంటాడతను.  

అమెరికన్, కొరియన్ ఫోన్ వినియోగదారులమీద చేసిన పరిశోధనలో అమెరికన్ లు వాళ్ళు ఏం చెప్పదలచుకున్నారన్నదానిమీద ఎక్కువ దృష్టి పెడితే, కోరియన్ లు వాళ్ళ గురించి ఇతరులు ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నారన్నదాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లుగా తెలిసింది.  అందుకే అమెరికన్ ఫోన్ వినియోగదార్లు కస్టమైజ్ చేసుకోవటంలో ఎక్కువ ఆసక్తి చూపించకుండా ఉండటం, కొరియన్లు తమ ఫోన్లను కస్టమైజ్ చేసుకోవటానికి ఎక్కువ మక్కువను చూపించటం పరిశోధకులు గమనించారు.

మీరు మీ ఫోన్ ని మీలో భాగంగా చూసినప్పుడే దాన్ని మీ ఆలోచనలకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకుంటారు.  అందువలన మీరేమిటో మీ ఫోన్ తెలియజేస్తుంది.  

ఫోన్ కంపెనీలు కూడా వినియోగదార్లు కస్టమైజ్ చేసుకోవటానికి ఎక్కువ వెసులుబాట్లను కలిగించి తద్వారా వాళ్ళు దాన్ని తమలో భాగంగా చూసుకునేట్లుగా చేస్తున్నారని కూడా పరిశోధనలో తేలింది.  

మొబైల్ ఫోన్ దాన్ని ఉపయోగించే వ్యక్తిత్వాన్ని తెలియజేయటమే కాకుండా, ప్రతి ఒక్కరికీ ఒక గుర్తింపుగా మారిందనటంలో అతిశయోక్తి లేదు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles