Union home minister announces safety of gandhi files

gandhi files safe rajnath singh says, union home minister announces safety of gandhi files, rajnath singh explains suo motu about gandhi files, files related to gandhi safe says home minister

union home minister announces safety of gandhi files

గాంధీ హత్యకి చెందిన దస్త్రాలు సురక్షితం!

Posted: 07/11/2014 06:06 PM IST
Union home minister announces safety of gandhi files

కార్యాలయాల్లో అనవసరంగా పేరుకుపోయిన చెత్తా చెదారాలను తీసివేసే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వంలో లక్షన్నర పాత ఫైళ్ళను తగలబెట్టారని, అందులో గాంధీ హత్యకు సంబంధించిన పేపర్లు కూడా ఉన్నాయని వచ్చిన అభియోగానికి సమాధానంగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జూన్ 5 నుంచి జూలై 8 వరకు వెలికి తీసిన వ్యర్థ దస్త్రాలు కేవలం 11100 లని, అందులో గాంధీ హత్యకు సంబంధించిన పేపర్లు లేవని రాజ్య సభలో ప్రకటన చేసారు.

సుమోటాగా చేసిన ప్రకటనలో రాజ్ నాథ్ సింగ్ మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన దస్త్రాలే కాకుండా సిపిఐకి చెందిన ఎంపి పి.రాజీవ్ ఆరోపించినట్లుగా, తీసేసిన ఫైళ్ళల్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, లాల్ బహాదుర్ శాస్త్రి, లార్డ్ మౌంట్ బాటన్ కి చెందిన దస్త్రాలు కూడా ఏమీ లేవని అన్నారు.  

కార్యాలయాల్లో పనిచేసే వాతావరణాన్ని మెరుగుపరచటం కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలో కేవలం పారిశుద్ధ్యాన్ని పెంచి, కాలుష్యాన్ని తగ్గించి, పనిచేసే స్థలాలను ఉద్యోగులు తమ పనులను పూర్తిచేసుకోవటానికి దోహదపడేలా చెయ్యటమే ఉద్యేశ్యంగా జూన్ 4 న నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని కూడా ఆయన సభ్యులకు తెలియజేసారు.  

నేషనల్ ఆర్చివ్స్ కూడా మహాత్మా గాంధీకి చెందిన 52 ఫైళ్ళు, 67 ఎగ్జిబిట్లు, 11186 పేజీల నివేదిక చెక్కు చెదరకుండా ఉన్నాయంటూ ప్రకటన చేసింది.  

గాంధీ హత్య విషయంలో హిందుత్వ అంశాన్ని కప్పిపుచ్చటం కోసమే ఫైళ్ళను నాశనం చెయ్యటం జరిగిందన్నది సిపిఐ ఎంపీ పి.రాజీవ్ మీడియాలో చేసిన అభియోగం.  దానికి సమాధానంగా ఎవరూ అడగక పోయినా, తనంతట తానుగానే రాజ్ నాథ్ సింగ్ పై విధంగా వివరణనిచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles