Finance ministers aware of unutilized funds at year end

projects in union budget 2014 , deficit budget made up with unutilized funds, finance ministers aware of unutilized funds at year end, unutilized funds to the rescue of deficit budget management

finance ministers aware of unutilized funds at year end

ఆర్థిక మంత్రులకు అండగా నిలిచే ప్రణాళికలు

Posted: 07/11/2014 05:58 PM IST
Finance ministers aware of unutilized funds at year end

కేంద్ర ఆర్థిక మంత్రలు బడ్జెట్ ప్రసంగాలలో చేసే ప్రకటనలలోని కొత్త ప్రాజెక్ట్ ల కేటాయింపులు కేవలం కాగితం మీద అంకెలకే పరిమితమౌతాయన్నది నిజమని తెలుసుకున్న కొత్త ఆర్థిక మంత్రి కూడా ధైర్యంగా కొన్ని ప్రాజెక్ట్ లకు నిధుల కేటాయింపులను ప్రకటించేసారని ఆర్థిక శాస్త్ర, రాజకీయ రంగ విశ్లేషకులు అంటున్నారు.  

బడ్జెట్ లో కేటాయింపు, ప్రకటనల సమయం వేరు, వాటిని అమలు చెయ్యటానికి పట్టే సమయం వేరు కాబట్టి చాలా సందర్భాల్లో కేటాయించిన నిధిని ఆ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా లేక అసలే వినియోగించుకోలేని స్థితిలోనే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు.  ఎందుకంటే ప్రాజెక్ట్ అంటే ముందు దాని మీద తర్జనభర్జనలు, భూసేకరణ, ఆ తర్వాత దశలవారీ అమలు జరుగుతుంది.  ఈ లోపులో పుణ్యకాలం కాస్తా దాటిపోతుంది, ఇట్టే సంవత్సరం తిరిగిపోతుంది.  అప్పుడే జూలై మాసం అయిపోతోంది.  ఈ మిగిలిన కాలంలో ప్రాజెక్ట్ లమీద ఎంత సమయాన్ని వెచ్చిస్తారు, ఎంత ముందుకు తీసుకెళ్తారన్నది ఆర్థిక మంత్రులకు బాగా తెలుసు.  

అందువలన చాలా సందర్భాలలో ప్రకటించిన ప్రాజెక్ట్ ల వలన ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరగటం, రాజకీయంగా లాభించటం జరుగుతుంది.  సంవత్సరం తిరిగి రాగానే నిధులను కేటాయించాం కానీ వాటిని వాడుకోలేదంటూ కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా తమ గొప్పతనం ఖాతాలో జమచేసుకుంటుంది.  దానితో లోటు బడ్జెట్ లో కొంత బెడద తీరిపోతుంది.  ఇదే ధైర్యంతో లోటు బడ్జెట్ తయారు చెయ్యటం జరుగుతుంది.  నిజంగా కేటాయించిన నిధులను వినియోగించుకున్నట్లయితే లోటు పూరించటం ప్రభుత్వానికి తల ప్రాణం తోకకి వచ్చినంత పనౌతుంది.

ఈ కిటుకు తెలుసు కనుకనే ప్రణబ్ ముఖర్జ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఆ స్థానంలో చిదంబరం బడ్జెట్ ప్రకటనలు చేసినప్పుడు కానీ ఎంత మాత్రం సంశయం లేకుండా వాటిని పూర్తి చెయ్యటం ఎలా సాధ్యమౌతుందని ఆలోచించకుండా ప్రకటించటం జరిగింది.  అదే బాటలో ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా వెళ్తున్నారన్నది విశ్లేషకుల వాదన.  

గత పది సంవత్సరాలలో రైల్వే బడ్జెట్ లో 99 ప్రాజెక్ట్ లను ప్రకటించటం జరిగింది కానీ అమలైంది మాత్రం ఒకటేనని రైల్వే మంత్రి సదానంద గౌడ అన్నారు.  

అస్సాంలో కానీ అది ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగినా ప్రాజెక్ట్ ల ప్రకటనలు వోట్లు గెలుచుకోవటానికే బాగా పనికివస్తాయన్నది దీనితో అర్థమౌతోంది.      

నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రాజెక్ట్ ల విషయంలో చర్చించి, వాటిని అమలు పరచటానికి షెడ్యూల్స్ తయారు చేసుకుని, వాటిని అక్షరాలా పాటించేట్టుగా నియంత్రణ చేస్తూ నిధులను విడుదల చెయ్యటం ద్వారా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్ళాలి.  కానీ అలాగే గనక జరిగితే కేటాయించిన నిధులు సంవత్సరాంతంలో మిగిలిపోవటం అనేది ఉండదు, అప్పుడు లోటు బడ్జెట్ ని ఎలా పూరించాలా అన్నది సమస్యగా మారుతుంది.  ఇప్పుడా సమస్య ఎదురవదనే ధైర్యం ఉండబట్టే సాహసించి ప్రాజెక్ట్ లకు నిదులను కేటాయించటం జరుగుతోందన్నది విశ్లేషకుల అంచనా.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య అంటే ఇదేనేమో!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles