Uproar in maharashtra assembly on suspended mlas

maharashtra assembly, maharashtra mlas, mlas thrash traffic cop

uproar in maharashtra assembly on suspended mlas

maharashtra-assembly.png

Posted: 03/22/2013 05:07 PM IST
Uproar in maharashtra assembly on suspended mlas

mlas-arrested

ఇది ప్రజాస్వామ్యమే, వారు ప్రజాప్రతినిధులే కాదని ఎవరూ కానీ, చట్టాన్ని గౌరవించటం కూడా అవసరమే. చట్టాన్ని అమలు పరచేవారికే కాదు చట్టాలను చేసే వారికీ ఆ చట్టాలను పాటించటం ఆవశ్యకమే.

మహారాష్ట్ర శాసన సభలో పోలీసు అధికారిని కొట్టిన కేసులో ఐదుగురు సభ్యులను అరెస్ట్ చెయ్యటానికి వచ్చిన ఇద్దరు క్రైం బ్రాంచ్ అధికారులకు అలా చేసే అనుమతీ అధికారాలు లేకుండానే వారు చొరబడ్డారని, అలా వచ్చినవారిని సస్పెండ్ చేస్తూ, ఆ కేసులో ఆ సభ్యులను సస్పెండ్ చేసిన సభాపతి దాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు అక్కడి శాసనసభలో అన్ని ప్రతిపక్ష నాయకులూ ఆందోళన చేసి గందరగోళాన్ని సృష్టించారు.

సచిన్ సూర్యవంశీ అనే ట్రాఫిక్ పోలీసు అధికారిని శాసన సభ్యుడు కొట్టిన సమయంలో ఆ అధికారి విధుల్లో లేడని, అందువలన విధులలో ఉన్న అధికారిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారంటూ వాళ్ళ మీద మోపిన సెక్షన్ 353 తప్పు అని సభ్యులు వాదించారు.

ఆ పోలీస్ అధికారి ట్రాఫిక్ విభాగంలో ఉన్నందువలన ఆ సమయంలో విధాన్ భవన్ లో అతనికి అధికారికంగా ఏ పని లేదన్నది వాస్తవమే కానీ, చట్టాలను పాస్ చేసి ప్రభుత్వ విధానాలను నిర్ణయించి తీర్మానాలను చేసే సభ్యులు అలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చా మరి. తప్పు చేసిన వారిని దండించేవారు వీరయితే కాదు కదా. పైగా అపరాధం జరిగినట్లుగా ఋజువు కాలేదు కదా.

సభను అలా సాగనివ్వకపోవటంతో సభాపతి వసంత్ పుర్కే సభను వాయిదా వేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rapist sentenced in ap to 22 years under nirbhaya act
Agitating harish rao at vidyut soudha arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles