Rajahmundry mp

rajahmundry mp, Car, House, Judge Son, Birthday, Chicken shop, car parking, City, Police,

rajahmundry mp

rajahmundry.gif

Posted: 08/21/2012 03:30 PM IST
Rajahmundry mp

rajahmundry  mp

తన కారుకు అడ్డుగా కారు ఉందన్న ఆగ్రహంతో ఓ ఎంపీ ఆ కారు యజమానిపై చెయ్యి చేసుకున్నారు. తీరా అతడు ఓ జడ్జి కుమారుడని తెలిసి నాలుక్కరుచుకున్నారు. బాధితుడికి సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. రాజమండ్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఓ జడ్జి కుమారుడు తన పుట్టినరోజు కావడంతో చికెన్ కొనేందుకు స్థానిక కోరుకొండ రోడ్‌లోని ఓ దుకాణానికి వెళ్లాడు. కారును పక్కగా ఆపి చికెన్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో ఎంపీ అక్కడకు దగ్గరలోనే ఉన్న తన ఇంటినుంచి కారులో బయల్దేరి అటుగా వచ్చారు. జడ్జి కుమారుడి కారు అడ్డుగా ఉందని భావించిన ఎంపీ, ఆయన అనుచరులు కారు దిగి దుర్భాషలు మొదలు పెట్టారు. అంతటితో ఆగక ఆ యువకుడిపై చెయ్యి చేసుకున్నారు. స్థానికులు గుమిగూడడంతో కాస్త తగ్గిన ఎంపీ స్వయంగా అర్బన్ ఎస్పీ రవికుమార్ మూర్తికి ఫోన్ చేయడంతో పోలీసుసిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత తాను చెయ్యి చేసుకున్న యువకుడు న్యాయమూర్తి కుమారుడని తెలిసిన ఎంపీ వెనక్కి తగ్గారు. వెంటనే అతడికి సర్ది చెప్పి, అతడి పుట్టినరోజని తెలుసుకుని శుభాకాంక్షలు కూడా చెప్పారు. జరిగిన దాన్ని మర్చిపొమ్మంటూ అక్కడినుంచి ఆయన వెళ్లిపోయారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడంతో కేసు నమోదు కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Missing train engine
Kcr visits childhood friend for ramzan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles