దగ్గుబాటి రానా
టాలీవుడ్ కండలవీరుడిగా పేరొందిన ఈ నటుడు.. దగ్గుబాటి సురేష్ బాబు, లక్ష్మి దంపతులకు 1983 డిసెంబర్ 14వ తేదీన చెన్నైలో జన్మించాడు. ఇతను ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు. ‘లీడర్’ (2010)తో తెలుగుపరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయనకు ‘కృష్ణం వందే జగద్గురుం’ (2012) చిత్రం నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.