Film Jokes
మందు షాపు ఎప్పుడు ఓపెన్ చేస్తారు?

ఒకరోజు తాగుబోతు రమేష్ రాత్రి 12 గంటల సమయంలో మందు షాపు ఓనర్ కి ఫోన్ చేసి ఇలా అంటాడు...
తాగుబోతు రమేష్ : నువ్వు మందు షాపు ఎప్పుడు ఓపెన్ చేస్తావ్?
మందుషాపు ఓనర్ : ఉదయం 9 గంటలకు ఓపెన్ చేస్తాను!
మరికొద్దిసేపు తరువాత తాగుబోతు రమేష్ మందుషాపు ఓనర్ కి ఫోన్ చేస్తాడు.
తాగుబోతు రమేష్ : నువ్వు మందు షాపు ఎప్పుడు ఓపెన్ చేస్తావ్?
మందుషాపు ఓనర్ : అరె చెప్పానుగా ఉదయం 9 గంటలకు అని!
మరికొద్దిసేపు తరువాత తాగుబోతు రమేష్ మళ్లీ షాపు ఓనర్ కి ఫోన్ చేస్తాడు.
తాగుబోతు రమేష్ : అన్నయ్యగారు.. మీరు మీ షాప్ ని ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు?
మందుషాపు ఓనర్ : నీయబ్బా.. నీకెన్నిసార్లు చెప్పాలిరా. ముందు చెప్పానుగా ఉదయం 9 గంటలకు ఓపెన్ చేస్తానని. ఎందుకు నస పెడుతున్నావు. ఉదయం 9 గంటలకు షాప్ కి వచ్చి.. నీకు కావాల్సిన బ్రాండ్ ని తీసుకెళ్లు!
తాగుబోతు రమేష్ : ఒరేయ్ వెధవ సన్నాసి... నేను నీ షాప్ లోపలే వుండి ఫోన్ చేస్తున్నానురా తింగరోడా!