Suryakantham biography who is named as shrew in law in the film industry

suryakantham news, suryakantham movies, t, suryakantham life story, suryakantham history, suryakantham story, suryakantham life, suryakantham latest news, suryakantham birthday, suryakantham death, suryakantham photos, suryakantham shrew in law, suryakantham

suryakantham biography who is named as Shrew-in-law in the film industry

ఆంధ్రాకోడళ్లను హడలెత్తించిన గయ్యాళి అత్త!

Posted: 10/24/2014 06:03 PM IST
Suryakantham biography who is named as shrew in law in the film industry

తెలుగు చలనచిత్రరంగంలో ఇంతవరకు నటించిన కొందరు ప్రముఖ నటీనటులు వారు నటించిన పాత్రల ద్వారా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు ఎంతోమంది వున్నారు. తమ సహజ నటన ద్వారా ప్రేక్షకాదరణ పొందిన అటువంటి నటీనటులలో సూర్యకాంతం ఒకరు! ఇప్పటికీ ఈమె గురించి ప్రస్తావన వస్తే కొంతమంది ఆంధ్రాకోడళ్లు హడలెత్తిపోతారని సమాచారం! ఎందుకంటే.. నిజజీవితంలో ఒక గయ్యాళి అత్త ఎలా వుంటుందో తన సహజ నటన ద్వారా ఈమె చేసి చూపించింది. అందుకే.. నాటికీ ఆమె వింటే కోడళ్లందరూ గయ్యాళి అత్త ఎలా వుంటుందోనని ఊహించుకుంటారట! తన సహజనటన ద్వారా ఎంతో గొప్ప తేరు తెచ్చుకున్న ఈమె.. ‘‘సహజనట కళా శిరోమణి’’గా పేరు సంపాదించుకుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమటింటే.. ఈమె నటించిన చిత్రాల్లన్నింటిలోనూ కేవలం ఒకే రకం పాత్ర పోషించి ప్రేక్షకుల నుంచి గొప్ప నటిగా పేరు సంపాదించుకుంది. చిత్రపరిశ్రమలో వున్నంతకాలం ఒకే పాత్రలో నటించిన నటులు ఎవ్వరూ లేరు!

జీవిత చరిత్ర :

1924 అక్టోబర్ 28వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గర వెంకటకృష్ణరాయపురంలో సూర్యకాంతం జన్మించింది. ఈమె తన తల్లిదండ్రులకు 14వ సంతానం! బాల్యం నుంచే సూర్యకాంతం పాటలు పాడటం, నాట్యమాడటం నేర్చుకుంది. అలాగే వయస్సు పెరిగే కొద్దీ సినిమా పోస్టర్లు చూస్తూ... అందులో తనను తాను ఊహించుకునేది. అలా చిత్రాల్లో నటించాలనే కోరిక ఆమె బలపడిపోయిన నేపథ్యంలో ఆమె చెన్నైకి చేరుకుంది. అక్కడ వెళ్లిన మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అయినా వెనుదిరగకుండా చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం నిత్యం శ్రమించేది. ఆ సందర్భంలోనే జెమిని స్టూడియో నిర్మించిన ‘‘చంద్రలేఖ’’ సినిమాలో ఈమెకు మొదట డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో తనకు రూ.65 జీతం ఇవ్వబోతే.. తన అసంతృప్తిని నిర్మాతతో తెలియబరిచింది. దాంతో ఆమెకు రూ.75 రూపాయల పెంచారు.

సినీ జీవితం :

మొదట డాన్సర్ గా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన సూర్యకాంతంకు 1949లో నిర్మించిన ‘‘ధర్మాంగధ’’ సినిమాలో మూగవేషం లభించింది. తర్వాత లీలాకుమారి సహాయంతో మొదటిసారిగా ‘‘నారద నారది’’ అనే చిత్రంలో సహాయనటిగా అవకాశం వచ్చింది. అయితే తనకు చిన్నచిన్నపాత్రలే వస్తున్నందున ఆమె జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కుంది కానీ అదే సమయంలో ‘‘గృహప్రవేశం’’ అనే చిత్రంలో సహాయనటిగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత  ‘‘సౌదామిని’’ చిత్రం ద్వారా హీరోయిన్ అవతారమెత్తింది. దాంతో మురిసిపోయిన ఈమె.. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోదామని ఎన్నో కలలు కంది కానీ ఆ సమయంలో అనుకోకుండా కారు ప్రమాదం జరిగింది. దాంతో ముఖానికి గాయం అవడంతో హీరోయిన్ గా నటించే అవకాశం తప్పిపోయింది.

తన ఆరోగ్య పరిస్థితి బాగైన తర్వాత ‘‘సంసారం’’ చిత్రంలో మొదటిసారిగా గయ్యాళి అత్తగా నటించింది. అంతే! ఆ సినిమా ఆమెకు ఎంతో మందిపేరు తెచ్చిపెట్టింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నలిచిపోయింది. తర్వాత నటించిన ‘‘కోడరికం’’ సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. కొత్త సినిమా వస్తోందంటే అందులో సూర్యకాంతం వుందా..? అని ప్రేక్షకులూ అడిగే స్థాయికి చేరుకున్నారంటే.. ఆమె ఎంతపేరు సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969).. ఇలా వరుసగా ఆమె మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.

సూర్యకాంతం వ్యక్తిత్వం :

ఏ విధంగా అయితే చిత్రాల్లో గయ్యాళి అత్తగా సూర్యకాంతం పేరు సంపాదించుకుందో.. అదేవిధంగా నిజజీవితంలోనూ మంచి పేరు సంపాదించుకుంది. ఇబ్బందుల్లో వున్నవారిని తనవంతు సహాయం అందిచేది. ఆమె షూటింగ్ కు వెళ్లినప్పుడల్లా తనతోపాటు తెచ్చుకున్న తినుబండారాలను ఇతరులకు పంచిపెట్టేది. షూటింగుల్లో జోకులు వేయడం, సరదాలు చేసుకోవడం లాంటివి చేసేది. ఒకనాడు షూటింగ్ లో బయటనుంచి కేకలు ఎక్కువగా వినిపిస్తుంటే.. ‘‘సైలైన్స్! అవుట్ సైట్’’ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు. ఆ సమయంలో ఫ్లోర్ లో వున్న సూర్యకాంతం ‘‘ఓ!’’ అని చాలా గట్టిగా అరిచింది. అదివిన్న మేనేజర్.. ‘‘ఏంటమ్మా?’’ అని అడిగితే.. అందుకు బదులుగా ‘‘సైలైన్స్ అవుట్ సైడ్ - అని కదా అన్నారు’’ అంటూ నవ్వేసిందట! దీంతో అక్కడున్న వాళ్లందరూ నవ్వేసుకున్నారట! ఇలా గొప్పవ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఈమె.. 1996 డిసెంబర్ 17వ తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles