Muppala ranganayakamma biography who is senational writer

muppala ranganayakamma news, ranganayakamma news, muppala ranganayakamma history, muppala ranganayakamma biography, muppala ranganayakamma life story, muppala ranganayakamma story, muppala ranganayakamma books, muppala ranganayakamma, mahatma gandhi, br ambedkar

muppala ranganayakamma biography who wrote nagative books on famous men persons

‘‘పురుష వ్యతిరేకి’’గా పేరొంచిన స్త్రీవాద రచయిత్రి!

Posted: 10/22/2014 04:25 PM IST
Muppala ranganayakamma biography who is senational writer

తెలుగు సాహిత్యరంగంలో కొంతమంది రచయితలు, రచయిత్రిలు ఇతరులపట్ల తమ మనసులో వుండే భావాలను రచయితల రూపంలో వ్యక్తపరిచి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు ఎందరో వున్నారు. మరికొందరు రచనల ద్వారా వివాదాస్పద రచయితులుగా పేరు సంపాదించుకున్నారు. అటువంటివారిలో రంగనాయకమ్మ కూడా ఒకరు. ఈమె ఒక సుప్రసిద్ధ మార్కిస్టు... స్త్రీవాద రచయిత్రి! స్త్రీలకు అనుకూలంగానూ, పురుషులను విమర్శిస్తూ వారికి వ్యతిరేకంగానూ రచనలు రాయడం వల్ల ఈమెకు ‘‘పురుష వ్యతిరేక’’ అని.. అలాగే రామాయణాన్ని మార్కిస్టు దృక్పథంతో విమర్శిస్తూ ‘‘రామాయణం కల్పవృక్షం’’ రాయడం వల్ల ‘‘బ్రాహ్మణ వ్యతిరేకి’’గానూ పేర్లు సంపాదించుకున్నారు. తన మనసులో ఇంత ఆవేశం దాగివున్నప్పటికీ.. ఈమె అద్భుతమైన భావ వ్యక్తీకరణతో కడుపుబ్బ నవ్వించే హాస్యరచనలు కూడా రాశారు. అందులో ప్రాచుర్యం పొందింది మాత్రం ‘‘స్వీట్ హోం’’ నవల!

జీవిత చరిత్ర :

రంగనాయకమ్మ 1939న పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామంలో జన్మించారు. తాడేపల్లిగూడెంలో ఉన్నత పాఠశాల చదువు పూర్తి చేసుకున్న అనంతరం 1955లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణులయ్యారు. అయితే ఉన్నత చదువులకోసం ఈమె తల్లితండ్రులు దూరప్రాంత కళాశాలకు పంపించి చదివించకపోవడంతో అంతటితోనే విద్యాభ్యాసము ఆగిపోయింది. తర్వాత 1958లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970లో ఆ వివాహము నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తనకంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడయిన బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ)తో కలసి నివసించారు. ఇలా బయటికొచ్చేసిన తర్వాత ఈమె తన పేరునుంచి తండ్రిపేరు ‘‘ముప్పాళ’’ను తొలగించేసి.. రంగనాయకమ్మను అలాగే వుంచేసుకున్నారు.

తెలుగు రచయిత్రులలో రంగనాయకమ్మది ప్రత్యేకస్థానం. ఎందుకంటే... తెలుగు భాష నుంచి మార్క్సిజం దాకా, సినిమాల నుంచి నవలల దాకా రచనల్లో బహుముఖ ప్రజ్ఞ ఆమె సొంతం. అయితే ఈమె అనేక విషయాల పై ఎన్నో విమర్శలు చేస్తుంటారు. గాంధి, అంబేద్కర్ లాంటి పేరొందిన వ్యక్తుల్ని కూడా విమర్శించారు. ఆనాడు వరవరరావు ‘‘చేతకాని వాళ్ళని కొజ్జావాళ్ళతో పోలుస్తూ’’ ఒక కవిత వ్రాస్తే... అందుకు జవాబుగా ఆమె ‘‘స్త్రీలని, కొజ్జావాళ్ళని కించపరిచే భాష వాడడం ఎందుకు తప్పో’’ వివరిస్తూ వ్యాసం వ్రాసారు. అది చదివిన వరవరరావు వెంటనే తన తప్పుని అంగీకరించారు. ఈమె వ్రాసిన విమర్శనాత్మక రచనలలో ‘‘అసమానత్వం నుంచి అసమానత్వం లోకే’’ ఒకటి!

వివాదాస్పదమైన రచనలు :

రంగనాయకమ్మ రాసిన ‘‘జానకి విముక్తి’’ అనే నవల.. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వస్తుండేది. అయితే ఆరోజుల్లో అది వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ప్రచురణ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ పుస్తకరూపంలో విడుదలయ్యింది. అలాగే ‘‘నీడతో యుద్ధం’’ అనే పేరుతో రాసిన పుస్తకంలో ‘‘గోరా, జయగోపాల్, సి.వి., ఎమ్.వి.రామమూర్తి’’ వంటి నాస్తిక రచయితల్ని విమర్శించింది. అయితే ఆ విధంగా రచయితల్నివిమర్శించడం న్యాయంకాదంటూ నినాదాలు చేసిన విశాఖపట్నం నాస్తికులు.. ఈ సీరియల్ ని నిలిపి వేయాలని కోరుతూ పత్రిక ఎడిటర్లకి ఉత్తరాలు వ్రాసారు. ఆధునిక తెలుగుసాహిత్యంలో తీవ్ర సంచలనం రేపిన యండమూరి వీరేంద్రనాథ్ నవల ‘‘తులసిదళం’’ని సైతం విమర్శిస్తూ.. 'తులసిదళం కాదు గంజాయి దమ్ము' అనే వ్యాస సంకలనం వ్రాసారు. అయితే తమను ఇలా విమర్శించడాన్ని జీర్ణించుకోలేకపోయిన యండమూరి తో బాటు ఆ నవలకు ముందుమాట వ్రాసిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు పరువునష్టం దావా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : muppala ranganayakamma  mahatma gandhiji  br ambedkar  telugu literatures  

Other Articles