Sindhu shines in forbes highest paid athletes ఫోర్బ్స్ సంపన్న క్రీడాకారిణుల జాబితాలో సిందూ.!

Sindhu lone indian in world s highest paid top 10 female athletes

PV Sindhu, ace shuttler, lone-Indian, top global icons, highest paid female athletes, forbes magazine, Serena Williams, Caroline Wozniacki, Sloane Stephens, Garbine Muguruza, Maria Sharapova, Venus Williams, badminton, badminton news, sports news, latest sports news, sports

PV Sindhu is the only Indian to feature among the world’s highest paid top 10 female athletes for 2018. The ace shuttler, placed at No. 7 in the top global icons, is also the only badminton player in the elite club.

ఫోర్బ్స్ సంపన్న క్రీడాకారిణుల జాబితాలో సిందూ.!

Posted: 08/22/2018 03:57 PM IST
Sindhu lone indian in world s highest paid top 10 female athletes

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అదాయాన్ని అర్జిస్తున్న క్రీడాకారిణుల జాబితాలో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధుకు స్థానం లభించింది. ప్రముఖ ఫోర్బ్స్‌ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో సింధు టాప్ టెన్ లో నిలిచింది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తున్న క్రీడాకారిణుల జాబితాలోని అత్యుత్తమ పదిమందిలో సింధూ కూడా ఒకరిగా నిలిచింది. గత ఏడాది ప్రకటించిన జాబితాలో పీవీ సింధు 13వ స్థానంలో వుండగా, తాజాగా ప్రకటించిన జాబితాలో 7వ స్థానాన్ని దక్కించుకుంది.

టోర్నీలు ఆడటం వల్ల పొందే ప్రైజ్ మనీతో పాటు వివిధ వాణిజ్య ఒప్పందాల ద్వారా వారు సంపాదించే మొత్తాన్ని బట్టి ఈ జాబితాలో క్రీడాకారిణుల ర్యాంకులను ఫోర్బ్స్‌ ప్రకటించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో సెరెనా విలియమ్స్ నిలిచింది. ఆమె అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవటం ఇది వరుసగా మూడోసారి.  టాప్ 10 లో స్థానం దక్కించుకున్న క్రీడాకారిణుల సంపాదన వివరాలు ఇలా వున్నాయి.

* టాప్ వన్ లో టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ 18.1 మిలియన్ డాలర్లు
* టాప్ టులో టెన్నిస్ క్రీడాకారిణులు కరోలిన్‌ వొజ్నొకి 13 మిలియన్ డాలర్లు,
* టాప్ త్రి లో స్లోనే స్టీఫెన్స్‌ 11.2 మిలియన్ డాలర్ల సంపాదనతో నిలిచారు.  
* టాప్ ఫోర్ గార్బిన్‌ ముగురుజ 11 మిలియన్ డాలర్లు
* టాప్ ఫైవ్ స్థానంలో మరియా షరపోవా 10.5 మిలియన్ డాలర్లు
* టాప్ సిక్స్ స్థానంలో వీనస్‌ విలియమ్స్‌ లు  10.2 మిలియన్ డాలర్ల
* టాప్ సెవన్ లో పీవీ సింధు 8.5 మిలియన్ డాలర్ల

భారత్ నుండి ఫోర్బ్స్‌ జాబితాలో టాప్10లో క్రీడాకారిణి పీవీ సింధు మాత్రమే ఉండడం విశేషం. అగ్ర స్థానంలో కొనసాగుతున్న సెరెనా గతేడాది తల్లి కావటం వల్ల ఆటలకు దూరమైనా ఆమె ప్రధమ స్థానంలో నిలిచింది. టాప్ 10 జాబితాలో 8 మంది టెన్నిస్ స్టార్ లు, ఒక రేస్ కార్ డ్రైవర్ వుండగా, మన స్టార్ షెట్లర్ తెలుగు తేజం పీవీ సింధు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles