CSK wins 100 matches in IPL history ఐపీఎల్ చరిత్రలో చెన్నై రికార్డు.. ధోని ఖాతాలో ఘనత..

Ms dhoni first ever captain to win 100 matches in ipl history

ms dhoni, ms dhoni 100 wins, rr vs csk, csk vs rr, rajasthan vs chennai, indian premier league, ipl 2019 match, rr vs csk t20, rajasthan royals vs chennai super kings, royals vs super kings, rajasthan royals, chennai super Kings, sports news,sports, latest sports news, cricket news, cricket

MS Dhoni on created yet another record as he became the first captain in Indian Premier League history to register 100 wins in the tournament.

ఐపీఎల్ చరిత్రలో చెన్నై రికార్డు.. ధోని ఖాతాలో ఘనత..

Posted: 04/12/2019 08:59 PM IST
Ms dhoni first ever captain to win 100 matches in ipl history

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రితం రోజు రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠకర పోరులో చివరి బంతి వరకు గెలుపు ఇరు జట్లను ఉవ్విళూరించినా.. చివరకు చెన్నైనే వరించింది. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై జట్టు తన ఖాతాలో మరో ఘనతను వేసుకుంది. అంతేకాదు ఈ జట్టుకు సారధిగా వ్యవహరిస్తోన్న ఆ జట్టు కెప్టెన్ ధోనీ ఖాతాలోనూ అరుదైన రికార్డు వచ్చి చేరింది.

రాజస్థాన్‌పై విజయం సాధించిన చెన్నై వంద మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో మొత్తం 12 సీజన్లో ఇప్పటి వరకు  మొత్తం 166 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సరిగ్గా శతవిజయ ఘనతను సాధించింది. అంతేకాదు, ఐపీఎల్‌లో వంద మ్యాచులు గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ పేరు రికార్డుల్లోకి ఎక్కింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  100 wins  rajasthan vs chennai  ipl 2019  chennai super kings  Cricket  

Other Articles