Kiwis thrash Men in Blue by 80 runs తొలి టీ20లో రోహిత్ సేన విఫలం.. కివీస్ విజయం..

India vs new zealand 1st t20 stats india s biggest t20i loss

India vs New Zealand T20, india national cricket team, ind vs nz t20, Ind vs NZ score, New Zealand national cricket team, T20 Series, Team India, Rohit Sharma, MS Dhoni, krunal pandya, Hardik pandya, Yazuvendra chahal, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

New Zealand inflicted the biggest defeat on India in the first T20I of the three-match series on Wednesday at Westpac Stadium in Wellington. As India failed to chase down the massive 220 run target, by faltering at 139 runs all out

తొలి టీ20లో రోహిత్ సేన విఫలం.. కివీస్ విజయం..

Posted: 02/06/2019 08:38 PM IST
India vs new zealand 1st t20 stats india s biggest t20i loss

వన్డేలలో కివీస్ పై 4-1తో సగర్వంగా సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ లో మాత్రం పేలవంగా ప్రారంభించింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ నిరాశపరిచిన రోహిత్ సేన ఆతిధ్య జట్టు చేతిలో పరాజయం పాలైంది. దీంతో కివీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్‌ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు టిమ్‌ సీఫెర్ట్‌ (43 బంతుల్లో 84), కొలిన్‌ మన్రో (20 బంతుల్లో 34) శుభారంభం చేశారు.

మిగిలిన బ్యాట్స్ మెన్‌ రాణించడంతో పటిష్ఠ టీమిండియా ముందు 220 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది‌. ఆ జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌ (22 బంతుల్లో 34) కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. వెంటవెంటనే మూడు వికెట్లు చేజార్చుకున్నా చివర్లో రాస్ టేలర్‌ (14 బంతుల్లో 23), కుగులీన్‌ (7 బంతుల్లో 20) మెరుపులు మెరిపించారు. హార్దిక్‌ పాండ్య 2, భువి, ఖలీల్‌, కృనాల్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు.

ఛేదనకు దిగిన భారత ఆటగాళ్లు అత్యంత ఉదారంగా ప్రవర్తించారు. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ 5 పరుగుల్లోపే పెవిలియన్‌ చేరారు. ఎంఎస్‌ ధోనీ (31 బంతుల్లో 39) టాప్‌ స్కోరర్ గా నిలిచాడు‌. విజయ్‌ శంకర్ (27)‌, శిఖర్‌ ధావన్‌ (29) కాస్త కష్టపడ్డారు. కృనాల్‌ పాండ్య (20) కాసేపు ధోనీకి సహకారం అందించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేశారు. పరుగులు చేయాలన్న ఆత్రుతలో పంత్‌, శంకర్‌, దినేశ్‌ కార్తీక్‌, పాండ్య అనవసర షాట్లు ఆడారు. వికెట్లు పడుతుండటంతో చేయాల్సిన రన్‌రేట్‌ 22కు చేరింది. కివీస్‌ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో రోహిత్‌ సేన 80 పరుగుల తేడాతో టీ20ల్లో పరుగుల పరంగా అత్యంత ఘోర ఓటమి చవిచూసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  T20 Series  Team India  MS Dhoni  Yazuvendra chahal  sports  cricket  

Other Articles