Yuvraj Singh: I see myself playing cricket till 2019 యువరాజ్ సింగ్ అభిమానులకు తీపికబురు..

I do fail admits yuvraj but won t give up at least till 2019

Yuvraj Singh, Yo-Yo fitness test, UNICEF, Ranji trophy, National Cricket Academy, 2011 World Cup, sports news,sports, latest sports news, cricket news, cricket

Yuvraj Singh has no qualms in conceding that he has been "failing" but the out-of-favour Indian cricketer says he won't give up on his career at least till 2019

యువరాజ్ సింగ్ అభిమానులకు తీపికబురు..

Posted: 12/04/2017 07:36 PM IST
I do fail admits yuvraj but won t give up at least till 2019

వరల్డ్ కప్ హీరోలలో ఒకరిగా నిలచిన డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్‌ సింగ్‌ అభిమానులకు శుభవార్త. యూవీ తాజా పర్యటనలకు ఫిట్ గా వున్నాడని అధికారికంగా దృవీకరించబడింది. అదెలా అంటారా.. కొత్తగా ప్రవేశపెట్టిన యో యో టెస్టును యువరాజ్ సింగ్ ఎట్టకేలకు  పాసయ్యాడు. భారత క్రికెట్‌ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే ఆటగాళ్లు యో యో పరీక్ష తప్పనిసరిగా పాసవ్వాలి. త్వరలో బీసీసీఐ శ్రీలంకతో టీ20, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్లను ప్రకటించనున్న నేపథ్యంలో యూవీ ఈ టెస్టు పాసయ్యాడు.

గతంలో మూడు సార్లు యో యో టెస్టుకు హాజరైన యువీ అర్హత మార్కు 16.1ని అందుకోలేకపోవడంతో ఆయన వల్ల అవుతుందా..? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ టెస్టును రెట్టించిన ఉత్సాహంతో జయించి.. తాను ఇక పర్యటనలకు సిద్దం అని బిసిసిఐ సెలక్టర్ల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. తాజాగా మరోసారి టెస్టుకు హాజరైన అతడు 16.3 మార్కును అందుకున్నట్లు సమాచారం. యువీతో పాటు యువ ఆటగాళ్లు వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ రానా కూడా యోయో టెస్టులో విజయం సాధించారు.

‘నేను ఫెయిలవుతున్నాను అని అనుకుంటూ కూర్చుంటే ఫెయిలవుతూనే ఉంటాం. యో యో టెస్టులో ఇప్పటికి నేను మూడు సార్లు ఫెయిలయ్యాను. తాజాగా మరోసారి ఆ పరీక్షకు హాజరుకాగా విజయం సాధించాను. ఒక ఫెయిల్యూర్ ను ఎప్పుడైతే మనం అధిగమిస్తామో అప్పుడు మనం విజయానికి ఒక మెట్టు పైకి ఎక్కినట్లే. అది జీవితంలో అయినా సరే.. వ్యక్తిగతంగా అయినా సరే. అపజయాలే మనల్ని ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. మరో లెవల్‌కు తీసుకెళ్తాయని యువరాజ్‌ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles