Irfan celebrated Yusuf Pathan’s ton in Ranji ఇండోర్ వేదకగా అన్నదమ్ముల అనుబంధం..

Irfan pathan celebrated brother yusuf pathan s ranji trophy ton

irfan pathan, yusuf pathan, baroda, baroda cricket team, madhya pradesh, madhya pradesh vs baroda, ranji trophy, ranji trophy opener, latest cricket news, cricket news, latest spoerts news, sports news, sports, cricket, irfan, yusuf

Expressing his happiness, 32-year-old Irfan took to Twitter to share a video of his brother’s blistering knock in the first innings, where Irfan is seen giving a hug to his elder brother

ఇండోర్ వేదికగా అన్నదమ్ముల అనుబంధం..

Posted: 10/12/2017 07:15 PM IST
Irfan pathan celebrated brother yusuf pathan s ranji trophy ton

తమ్ముడి జన్మదినం సందర్భంగా అన్న భావోద్వేగానికి లోనై పంపిన ఓ సందేశం యావత్ భారత క్రికెట్ అభిమానుల ప్రశంసలను అందుకోగా, తాజాగా మరో అన్నదమ్ముల అనుబంధం కూడా క్రికెట్ అభిమానుల ప్రశంసలకు వేదికగా నిలించింది. రంజీ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌-బరోడా మధ్య జరిగిన మ్యాచ్ అన్న శతకాన్ని నమోదు చేయగానే తమ్మడు భావోద్వేగానికి లోనై తన చేతిలోని బ్యాటును అక్కడే పడేసి.. అన్న చెంతకు చేరి ఆయనను తనివితీరా కౌగలించుకున్న ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.

బరోడా ఆటగాడు యూసుఫ్‌ పఠాన్‌ సెంచరీ సాధించగానే మరో ఎండ్‌ ఉన్న ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆనందంతో తబ్బిబ్బి అయిపోయి.. ఇలా తన అన్నను అభినందించాడు. అంతటితొ అగని ఇర్పాన్.. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను తన సామాజిక మాద్యమం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియో కింద ‘యూసుఫ్‌ శతకం సాధించాడు. లవ్‌ హిట్టింగ్‌’ అని కూడా ఇర్పాన్ పేర్కొన్నాడు. దీంతో అతని ఇన్ స్టాగ్రాం కు కూడా అభిమానులు రద్దీ పెరిగింది.

తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన మధ్యప్రదేశ్‌ 551 పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.  అనంతరం బరోడా బ్యాటింగ్ చేపట్టింది. సోదరులైన యూసుఫ్‌, ఇర్ఫాన్ పఠాన్ లు బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో యూసుఫ్ శతకం నమోదు చేయగానే ఈ సన్నివేశం చోటుచేసుకుంది. బరోడా తొలి ఇన్నింగ్స్‌లో యూసుఫ్‌ 111, ఇర్ఫాన్‌ 80 పరుగులు చేశారు. ఈ మ్యాచులో మధ్యప్రదేశ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : irfan pathan  yusuf pathan  baroda cricket team  madhya pradesh  ranji trophy  cricket  

Other Articles