Nehra announces retirement from cricket నవంబర్ 1న ఢిల్లీలో జరిగే టీ-20 మ్యాచ్ తో సరి...

Ashish nehra announces retirement from all forms of cricket

Ashish Nehra, Ashish Nehra retires, Australia, Cricket, Delhi cricket team, Feroz Shah Kotla, India,Indian Cricket Team, New Delhi, New Zealand, Rahul Dravid, Ranji Trophy, Sachin Tendulkar, Zaheer Khan

India fast bowler Ashish Nehra confirmed that he will retire from international cricket after the opener of a three-match Twenty20 series against New Zealand on Nov. 1 at his home ground in Delhi.

నవంబర్ 1న ఢిల్లీలో జరిగే టీ-20 మ్యాచ్ తో సరి...

Posted: 10/12/2017 05:32 PM IST
Ashish nehra announces retirement from all forms of cricket

టీమిం​డియా వెటరన్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతాడాని సంకేతాలను వెలువరించిన రెండు రోజుల వ్యవధిలోనే ఆయన అధికారికంగా రిటైర్మెంట్ తేదీని ప్రకటించారు. నవంబర్ 1న సొంత మైదానమైన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో న్యూజీల్యాండ్ తో జరిగే మ్యాచ్ తన ఐసీసీ కెరీర్ లోనే చివరి మ్యాచ్‌ అని చెప్పారు. రిటైర్మెంట్ అనేది తన వ్యక్తిగత నిర్ణయమని వెల్లడించిన ఆయన ఈ నిర్ణయం తీసుకునే ముందు తాను జట్టు కోచ్ రవిశాస్త్రీ, విరాట్ కోహ్లీతో కూడా చర్చించానన్నారు.

దేశం తరపున టీమిండియా క్రికెట్ జట్టుకు ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్ లో కొనసాగడం కూడా తన అదృష్టమని చెప్పిన ఆయన అందుకు గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం టీమిండియాకు సేవలందిస్తున్న భువనేశ్వర్, బుమ్రాతో బౌలింగ్ విభాగం సమతూకంగా ఉందన్నారు. ఇంకా రెండేళ్లు ఆడమని సహచరులు కోరారని, అయితే అందుకు తాను విముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. కాగా వచ్చే ఏడాది ఇండియన్ ప్రిమియర్ లీగ లోనూ నెహ్రా ఆడే అవకాశాలు కూడా తక్కువనే అంటున్నారు.

1999 లో మొహమ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నెహ్రా, ఇప్పటివరకు భారత్ తరపున 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 44 వికెట్లు, వన్డేల్లో 157, టీ20ల్లో 34 వికెట్లు తీశాడు. 2011లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కూడా నెహ్రా సభ్యుడిగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  New Zealand  IPL  India vs New Zealand  Ashish Nehra  retairement  Cricket  

Other Articles

 • India s test squad announced for three matches

  మూడు టెస్టులకు జట్టు ప్రకటన.. రోహిత్ ఔట్.. కుల్దీప్ ఇన్..

  Jul 18 | ఇంగ్లాండ్ తో జరిగిన రెండు పరిమిత ఓవర్ల సిరీస్ లలో ఒకదానిలో గెలిచి మరోటి ఓటమిపాలైన నేపథ్యంలో బిసిసిఐ అచితూచి అత్యంత కీలకమైన టెస్టు సిరీస్ కు మాత్రం ఆటగాళ్ల ఎంపికలో తీవ్ర కసరత్తే... Read more

 • Is ms dhoni contemplating retirement from odi cricket

  ధోని.. వన్డేలకు కూడా సెలవు ప్రకటిస్తున్నాడా.?

  Jul 18 | భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ త్వరలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడా.? రానున్న ప్రపంచ కప్ వరకు అడటానికి తాను అన్ని రకాలుగా ఫిట్ గా వున్నానని... Read more

 • Gautam gambhir responded on the white beard of ms dhoni

  ధోని రంగు మార్చుకుంటే విమర్శలకు బ్రేక్..

  Jul 16 | భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ఓ సూచన చేశారు. ధోని రంగుమార్చుకుంటే విమర్శలకు బ్రేక్ పడుతుందని అన్నాడు. అదేంటి రంగుకు, విమర్శలకు... Read more

 • For soha ali khan s daughter inaaya special gift message from mithali raj

  మిథాలీ రాజ్.. ప్రోత్సాహం.. ప్రశంసనీయం..

  Jul 16 | సందర్భమో.. అసందర్భమో.. లేక మరేదైనా కారణముందో తెలియదు కానీ.. ఏకంగా తాను వాడుతున్న బ్యాట్ పై ఒక చక్కని సందేశంతో పాటు తన అటోగ్రాఫ్ చేసి టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్..... Read more

 • Ramesh powar named interim coach of indian women s cricket team

  రమేష్ పవార్.. టీమిండియా తాత్కాలిక కోచ్

  Jul 16 | టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ రమేశ్ పవార్ కు భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ బాధ్యతలను తాత్కాలిక ప్రాతిపదికన అందజేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరి రవిశాస్త్రీకి ఏం చేస్తాడు.. ఆయన లీవ్ లో వెళ్తున్నారా..?... Read more

Today on Telugu Wishesh