MS Dhoni equals world record with 99 ODI stumpings ఆ 99 ధోనిని సంగక్కర సరసన నిలిపాయి..

Ms dhoni equals world record with 99 odi stumpings

MS Dhoni, wicket-keeper, stumping, India vs Sri Lanka, SLvIND, cricket news, cricket, sports news, latest news

Indian wicketkeeper MS Dhoni, equalled the world record of most stumpings in ODI cricket, when he inflicted Danushka Gunathilaka's dismissal in the second odi match between against Sri Lanka.

ప్రపంచ రికార్డు సమం.. సంగక్కర పక్కన స్థానం

Posted: 08/24/2017 06:23 PM IST
Ms dhoni equals world record with 99 odi stumpings

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇవాళ తన అద్బుత ఆటతీరుతో మరో ఘనతను సాధించాడు. అటు బ్యాట్స్ మెన్ గా తనదైన హెలీకాఫ్టర్ షాట్ ను వినియోగంలోకి తీసుకువచ్చిన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఇటు కీపింగ్ లో కూడా అద్భుతంగా రాణించి అనేక మంది దిగ్గజాలను కూడా తన స్టప్టింగ్లతో పెవిలియన్ బాట పట్టించిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ ధోని ఈ అంశంలో ప్రపంచ రికార్డును సమం చేశాడు.

వన్డే కెరీర్‌లో 99వ స్టంపౌట్‌ చేసి ప్రపంచ రికార్డును సమం చేసి అదే స్థాయిలో స్టంపిగ్లు చేసిన శ్రీలంక దిగ్గజ అటగాడు కుమార సంగక్కర సరసన స్థానాన్ని సంపాదించాడు. పల్లెకలే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో యజువేంద్ర చాహల్‌ వేసిన 14.1వ బంతిని ఆడేందుకు ఓపెనర్‌ గుణతిలక క్రీజు వదిలి ముందుకొచ్చాడు. బంతి అందుకోవడంలో ధోనీ జాప్యం చేసినా గుణతిలక ఇంకా క్రీజులోకి రాకపోవడంతో వికెట్లను గిరాటేశాడు. దీంతో గుణతిలకను ధోని స్టంపౌట్ చేసి.. ప్రపంచ రికార్డును సమం చేశాడు. మరో స్టంపౌట్ చేస్తే ధోని పేరన వన్డేలలో కొత్త చరిత్ర లిఖించబడుతుంది.

ఈ 99 స్టంపౌట్ లలో అధికంగా హర్భజన్ సింగ్ చేతి నుంచి జాలువారిన బంతుల నుంచి వున్నవే కావడం గమనార్హం. 19 స్టంపింగ్ లు హర్బజన్ బౌలింగ్ లో చేయగా, ఆ తరువాత రవీంద్ర జడేజా బౌలింగ్ లో 15, అశ్విన్ బౌలింగ్ లో 14 స్టంపౌట్ లు చేశాడు. ఇక మరో 19 స్టౌంపవుట్లు వివిధ బౌలర్ల బౌలింగ్ లో చేశారు. కాగా ఈ క్రమంలో మొత్తంగా ధోని వికెట్ కీపర్ గా 377 (28 క్యాచులు, 99 స్టంపౌవుట్లు) అవుట్లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, కీపింగ్ లో కుమార సంగక్కర 482 వికెట్లతో తొలిస్థానంలో వుండగా, ఆయన తరువాత అడమ్ గిల్ క్రిస్ట్ 472 వికెట్లతో రెండో స్థానంలో వుండగా, బౌంచర్ 424 వికెట్లతో మూడో స్థానంలో నిలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Ind Vs SL  MS Dhoni  Harbhajan Singh  Kumar Sangakkara  cricket  

Other Articles