Virat Kohli bats for MSD momentum టీమిండియా మాజీ కెప్టెన్ కు మద్దతుగా కోహ్లీ

Ms dhoni will find momentum with india s string of odis virat kohli

Virat Kohli, Mahendra Singh Dhoni, india v sri lanka, Kuldeep Yadav, Hardik Pandya, Axar Patel, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

MS Dhoni's form and future in the next three months will enable the former skipper get some momentum and consistency going his way, feels skipper Virat Kohli.

టీమిండియా మాజీ కెప్టెన్ కు మద్దతుగా కోహ్లీ

Posted: 08/24/2017 05:47 PM IST
Ms dhoni will find momentum with india s string of odis virat kohli

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అటు టెస్టులకు గుడ్‌బై చెప్పి.. ఇటు వన్డే కెప్టెన్సీ పగ్గాలను కూడా వదిలిన తరువాత పూర్తిగా నిరాశ, నిసృహల్లోకి జారుకున్నారు. దీంతో అతని ఆట ప్రదర్శన కూడా అంతగా అకట్టుకోవడం లేదు. అయితే అతనికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ధోనికి మద్దతుగా నిలిచారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతున్న ధోనీ త్వరలోనే తన పూర్వపు ఆటను అందుకుంటారని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

శ్రీలంకతో రెండో వన్డే సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ‘2019 ప్రపంచ కప్‌కి ముందు భారత్‌ సుమారు 24 వన్డేలు ఆడనుంది. ధోనీ టెస్టులు ఆడటం లేదు. దీంతో అతడు గత ఫామ్ ను అందుకోవడం కొంచెం కష్టం. ఈ 24 వన్డేల్లో ధోనీ తన ఫామ్ ను అంది పుచ్చుకుంటాడని తాను కోరుకుంటున్నానని కోహ్లీ తెలిపాడు. ప్రపంచకప్‌ని దృష్టిలో పెట్టుకుని వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడించేందుకు ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామని, ఈ ప్రణాళిక ధోనీకి బాగా ఉపయోగపడుతుందని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ధోనీతో పాటు జట్టులోని ఆటగాళ్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోహ్లీ ఆటగాళ్లకు సూచించాడు. శ్రీలంక పర్యటన నుంచే ప్రపంచకప్ కి వేట మొదలు పెడతామని ఇప్పటికే చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కోహ్లీ వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి. కీలక ఆటగాళ్లు జట్టును వీడినప్పుడు భారత్‌ ఆ ఒత్తిడిని తట్టుకుని ఎలా రాణించింది అని కోహ్లీని అడగ్గా.. ఇది చాలా క్లిష్టమైన సమయం. దేశం తరఫున ఆడుతున్నాం అన్న భావనతో జట్టులోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మన మైండ్‌సెట్‌ని మార్చుకుని సవాళ్లను స్వీకరించాలి’ అని కోహ్లీ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Virat Kohli  Mahendra Singh Dhoni  india v sri lanka  momentum  cricket  

Other Articles