fans want MS Dhoni back as India captain టీమిండియా కెప్టెన్ గా విరాట్ వద్దు.. ధోనినే ముద్దు..!

Indian fans want ms dhoni back as india captain

Indian most succesfull captain, fans want dhoni back as captain, MS dhoni, team india, captaincy, virat kohli, anil kumble, bcci, cricket news, sports news, sports, cricket

India coach Anil Kumble tendered his resignation, fans took to various social media platforms calling Kohli's head, and demanding the return of Dhoni as the captain of India.

టీమిండియా కెప్టెన్ గా విరాట్ వద్దు.. ధోనినే ముద్దు..!

Posted: 06/22/2017 06:14 PM IST
Indian fans want ms dhoni back as india captain

టీమిండియాలో ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లే.. కెప్టెన్ విరాట్ కోహ్లీల మద్య రాజుకున్న వివాదం నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ లో దాయాధి పాకిస్థాన్ చేతితో విరాట్ సేన ఘర పరాజయాన్ని చవిచూసింది. ఈ తరుణంలో గాలివానగా రేగిన వివాదం.. తుఫానులా మారి.. ఏకంగా కోచ్ పదవికి అనీల్ కుంబ్లే రాజీనామా చేసి తప్పుకునేంత వరకు చేరుకుంది. ఈ క్రమంలో టీమిండియా అటగాళ్లు.. విరాట్ కోహ్లీకి అండగా నిలువగా, సీనియర్ క్రికెటర్లు మాత్రం అనీల్ కుంబ్లేకు బాసటగా నిలుస్తున్నారు.

కొందరు సీనియర్లు విరాట్ సేనపై విమర్శలకు కూడా దిగుతున్నారు. ప్రధాన కోచ్ అంటే మీరు చెప్పినదానికల్లా తానా అంటే తందానా అనాలా అంటూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తప్పించి, తిరిగి మహేంద్ర సింగ్ ధోనీకి పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. 2019 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా క్రికెట్ అభిమానులు ఈ డిమాండ్ ను తెరపైకి తీసుకువస్తున్నారు. గెలుపోటములు సహజం కానీ.. జట్టులో విభేదాలు తారాస్థాయికి చేరడం.. జట్టు సభ్యులలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న వాదనలు కూడా వినపిస్తున్నాయి.

టీమిండియాను సమర్థవంతంగా నడిపించేంత శక్తిసామర్థ్యాలు కోహ్లీకి లేవని అభిమానులు అక్షేపిస్తున్నారు. ధోనీ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ, ప్రపంచకప్‌, టీ20 ప్రపంచ కప్‌ గెలిచింది. ఎంతో విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోనీని తిరిగి టీమిండియా కెప్టెన్‌ చేయాలన్న డిమాండ్ కు మద్దుతు పెరుగుతోంది. విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ మధ్యలో ధోనిని సలహాలు, సూచలను అడుగుతుండటం కనిపించడంతో.. ఇక ఆయనకే మరోమారు కెప్టెన్సీ పగ్గాలను అందించాలని అభిమానులు కోరుతున్నారు.

ఇప్పటికే 35 సంవత్సరాల వయసులో కెరీర్ లో ధీటుగా రాణిస్తున్న ధోనికి కెప్టెన్సీ పగ్గాలను అందించి.. విరాట్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది. కోచ్ కుంబ్లే.. కోహ్లీ మధ్య నెలకొన్న విభేదాలే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ పై పరాజయానికి కారణమని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాదు ధోనీ సారథిగా ఉన్న సమయంలో జట్టులో మంచి వాతావరణం ఉండేది. కోచ్‌లతో కూడా ధోనీ సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. కోహ్లీ కంటే ధోనీనే మెరుగైన సారథని అభిప్రాయపడుతున్నారు. దయచేసి ధోనీని కెప్టెన్‌గా నియమించండి అని వరుస ట్వీట్లతో అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS dhoni  team india  captaincy  virat kohli  anil kumble  bcci  cricket  

Other Articles