Kohli can select his own coach says Anil kumble కుంబ్లేను కోచ్ గా వద్దన్నవారే తప్పుకోవాలి..

Sunil gavaskar bats for anil kumble says kohli can select his own coach

anil kumble, coach anil kumble, sunil gavaskar, india cricket coach, icc champions trophy, anil kumble, bcci, sourav ganguly, sunil gavaskar, ICC Champions Trophy 2017, sachin tendulkar, sourav ganguly, tom moody, virat kohli, vvs laxman, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

Coming out openly in support of Kumble, cricket legend Sunil Gavaskar has said that if it’s only the captain’s wish that matters then there is no point behind establishing Cricket Advisory Committee (CAC) to take a call on various issues

కుంబ్లేను కోచ్ గా వద్దన్నవారే తప్పుకోవాలి..

Posted: 06/22/2017 07:01 PM IST
Sunil gavaskar bats for anil kumble says kohli can select his own coach

టీమిండియా క్రికెటర్లపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ విరుచుకుపడ్డాడు. కుంబ్లేను భరించలేమని, హెడ్ మాస్టర్లా వ్యవహరిసున్నాడని ఆటగాళ్లు ఫిర్యాదు చేసి ఉంటే.. అది చాలా పెద్ద తప్పు అని అన్నాడు. కోచ్ కఠినంగానే ఉండాలని, మెతగ్గా వ్యవహరిస్తే మెరుగైన ఫలితాలు రావని అన్నాడు. పత్రికల్లో వచ్చిన వార్తలు నిజమైతే.. కుంబ్లే విషయంలో ఆటగాళ్లు వ్యవహరించిన తీరు సరిగా లేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్ల ఇష్టాయిష్టాలకు అనుగూణంగా మెలిగే కోచ్ వుంటే.. ఫలితాలు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

ప్రాక్టీసు ఇబ్బందిగా వుందా..? ఈ రోజు రెస్టు తీసుకుని షాపింగ్ చేయండీ అని చెప్పే కోచ్ లతో టీమిండియా ఫలితాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. హాయిగా షాపింగ్‌ చేసుకోండని అనుమతిచ్చే కోచ్‌ కావాలనుకుంటున్నారా.? అని గవాస్కర్ టీమిండియా క్రికెటర్లను ప్రశ్నించాడు. కుంబ్లేపై ఫిర్యాదు చేసిన ఆటగాళ్లే జట్టులోంచి తప్పుకోవాలని అన్నాడు. కఠినంగా ఉంటూ.. కుంబ్లేలా ఫలితాలు సాధించిన కోచ్‌పై ఏ ఆటగాడైనా ఫిర్యాదు చేసి ఉంటే.. తన దృష్టిలో ఆ ఆటగాడే జట్టును తప్పుకోవాలని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

టీమిండియా క్రికెట్‌కు అనిల్‌ కుంబ్లే చేసిన సేవలను గవాస్కర్ ప్రశంసించాడు. ‘‘ఆటగాడిగా కుంబ్లే ఎంతో సాధించాడు. కోచ్‌గానూ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అలాంటి వ్యక్తిపై దుష్ప్రచారం జరుగుతోందని అవేదన వ్యక్తం చేశాడు. కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేసినా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రానున్న కోచ్ కు చెడు సంకేతాలను పంపిస్తుందని అన్నాడు. కోచ్ అటగాళ్లను మెరుగుపర్చేందుకు దోహదపడతాడే కానీ.. అటగాళ్లకు లొంగివుండేందుకు కాదు అని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా అటగాళ్ల వైఖరి తమకు కోచ్ లోంగివుండాలన్న సంకేతాలను పంపుతుందని గవాస్కర్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india coach  icc champions trophy  anil kumble  sunil gavaskar  bcci  cricket  

Other Articles