BCCI invites applications for head coach post టీమిండియా కొత్త కోచ్ కోసం బిసిసిఐ ధరఖాస్తుల అహ్వానం

Bcci invites applicants for team india coach

Anil Kumble,BCCI,Team India,Head coach,BCCI, india, head coach, anil kumble, icc champions trophy, cricket

The Board of Control for Cricket in India has started its hunt to select the new head coach of the senior men's team.

టీమిండియా కొత్త కోచ్ కోసం బిసిసిఐ ధరఖాస్తుల అహ్వానం

Posted: 05/25/2017 09:28 PM IST
Bcci invites applicants for team india coach

టీమిండియా ప్రధాన కోచ్ గా అనీల్ కుంబ్లే తన సత్తాను చాటాడు. వరుసగా ఐదు దేశాలతో టీమిండియా టెస్టు సిరీస్ లను కైవసం చేసుకోవడమంటే అంత సులువు కాదు. కానీ దానిని చేసి చూపించిన జట్టుకు వెన్నుదన్నుగా నిలచి మెలకువలను నేర్పించాడు. టీమిండియా క్రికెటర్లందరి సహనానికి పరీక్ష్ పెట్టాడు. అయితే ఇంగ్లాండ్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో అనీల్ కుంబ్లే పదవీ కాలం ముగిసిపోతున్న నేపథ్యంలో మళ్లీ ఆయన సేవలను పోడగిస్తారని క్రికెట్ అభిమానులు భావించారు. అయితే అందుకు భిన్నంగా బీసిసిఐ వ్యవహరించింది.

టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అన్వేషణ ప్రారంభించింది. ఈ పదవికి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా వ్యవహరించాలనుకునే అసక్తిగల ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునంటూ ప్రకటన ఇచ్చింది.'పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కు కోసం ఆప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నాం. ఆసక్తిగల అభ్యర్ధులు ఆ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు'అని బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరి పేర్కొన్నారు.

కుంబ్లే పదవీకాలం ముగియనుండటంతో... ఆ తరువాత టీమిండియా ప్రధాన కోచ్ గా మరోకరికి బాధ్యతలను అప్పజెప్పాలనం బిసిసిఐ యోచిస్తుంది. ఈ క్రమంలో కుంబ్లేను టీమిండియా డైరెక్టర్ గా నియమించాలని చూస్తోంది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య సలహాదారు కమిటీ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుందని చెప్పింది. నిబంధనల ప్రస్తుతం హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే మాత్రం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. ఆయనకు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  india  head coach  anil kumble  icc champions trophy  cricket  

Other Articles